Home » PM Modi
రష్యా చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందని, ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ తనతో ఫోన్లో మాట్లాడారని కూడా ట్రంప్ చెప్పారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(గురువారం) కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటనను సైతం వైసీపీ నేతలు ఫేక్ ప్రచారానికి వాడుకుంటున్నారు. వైసీపీ ఫేక్ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఆరా తీసింది.
దేశ సేవే పరమావధిగా ప్రజలకు సేవ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఓ నిజమైన కర్మయోగిగా చూస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభివర్ణించారు. ధర్మాన్ని పాటిస్తూ కర్మను పాటించే నాయకుడు మోదీ అని ప్రశంసించారు పవన్ కల్యాణ్.
ప్రధాని నరేంద్ర మోదీ సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభా వేదికగా వివిధ ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వర్చువల్ విధానం ద్వారా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నన్నూరులో 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్' బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మరికాసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి గర్భాలయ శిఖరాన్ని దర్శించుకున్నారు. అలాగే రుద్రాభిషేకం నిర్వహించి, అమ్మవారికి కుంకుమార్చన చేశారు.
ప్రధాన మంత్రి ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. తరువాత మూలవిరాట్ శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, మల్లెపూల అర్చన, మహామంగళ హారతి, మంత్ర పుష్పాలతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.
కర్నూల్లోని ఓర్వకల్లు విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఆయనకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు స్వాగతం పలికారు.
ప్రస్తుతం ఆ రూట్లో వెళ్లే భారీ వాహనాలను దారి మళ్లింపు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తిగా వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.
కర్నూలు ఏయిర్ పోర్టు నుంచి రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభకు గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్, కేంద్ర రాష్ట్ర మంత్రులు బయలుదేరారు. ఈ నేపథ్యంలో రూ.13,430 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.