Share News

Jordan visit: జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

ABN , Publish Date - Dec 15 , 2025 | 07:13 PM

భారత ప్రధాని నరేంద్రమోదీ మూడు దేశాల పర్యటన షురూ అయింది. దీనిలో భాగంగా ఇవాళ జోర్డాన్ చేరుకున్న ప్రధానికి అక్కడ సాదర స్వాగతం లభించింది. నేటి నుంచి ఈనెల 18 వ తేదీ వరకూ ప్రధాని.. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటిస్తారు.

Jordan visit: జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
PM Modi Jordan visit

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 15: భారతీయ సంతతి భారత్-జోర్డాన్ సంబంధాలకు గణనీయమైన కృషి చేస్తున్నారని భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధాని మోదీకి జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో భారతీయ సంతతి నుంచి అపూర్వ స్వాగతం లభించింది.

modi-3.jpg


ఇవాళ మూడు దేశాల పర్యటనలో భాగంగా మొదటి జోర్డాన్‌కు చేరుకున్న ప్రధాని మోదీని హోటల్ వద్ద జోర్డాన్ లోని భారత సంతతికి చెందిన వారు భారత జాతీయ జెండాను చేతబట్టి ప్రధాని మోదీకి నమస్కరించి స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని వారిని ప్రేమతో పలుకరించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

modi-5.jpg


ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ డిసెంబర్ 15 నుంచి 18 వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ మూడు దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటన ద్వారా ఆయా దేశాలతో పురాతన సంస్కృతిక సంబంధాలతో పాటు ఆధునిక ద్వైపాక్షిక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాలన్నది ప్రధాని పర్యటన ప్రధాన లక్ష్యం.

modi-2.jpg


ప్రధాని మోదీ.. జోర్డాన్ సందర్శన భారత్-జోర్డాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతోంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్, ఆ దేశ ప్రధాని జాఫర్ హసన్‌లతో భేటీ కానున్నారు. జోర్డాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటిస్తారు.

modi-4.jpg


ఇవీ చదవండి:

అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!

జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..

Updated Date - Dec 15 , 2025 | 07:13 PM