Home » Pawan Kalyan
గోదావరి కుర్రాళ్ల బైక్‌ల వేగం మాదిరిగా.. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో కేంద్రం, రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైంది. ఇంజన్‌లో సీసీ పవర్ ఎంత ఎక్కువగా ఉంటే.. బైక్ కూడా అంత వేగంగా ముందుకెళ్తుంది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఎంపీ పురందేశ్వరి గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు.
పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఓ కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో జగన్ ఓ కేస్ స్టడీ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతిలో నిర్వహించిన సంవిధాన్ హత్యా దివాస్‌లో అనేక విషయాలపై బాబు ప్రసంగించారు.
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను కించపరిచేలా పోస్టులు పెట్టిన ముగ్గురు వ్యక్తులను కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు.
‘పొగాకుకు గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద రైతులకు తగిన ధర లభించేలా చేసేందుకు రాష్ట్రప్రభుత్వం రూ.273 కోట్లు నిధులు విడుదల చేసింది. దేశచరిత్రలోనే ఇలా చేయడం ప్రథమం.
మాది మంచి ప్రభుత్వం.. మెతక ప్రభుత్వం కాదు. దార్శనికుడైన సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సమర్థ ప్రభుత్వం.. పిచ్చివేషాలు వేస్తే తొక్కి నారతీస్తాం గుర్తుపెట్టుకోండి’ అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన నేతలు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు.
హిందూమతాన్ని, హిందూ దేవుళ్లను విమర్శిస్తూ, హేళనగా మాట్లాడమే లౌకికవాదంగాప్రకటించుకునే దుష్టశక్తులను పారదోలేందుకు హిందువులంతా సమైక్యంగా పోరాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
పురుగుమందులు, ఎరువులతో భూమి విషతుల్యమైంది. ఇటువంటి భూమిలో పండే ఆహారం మనం తీసుకుంటున్నాం. ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన పంజాబ్ నుంచి రోజూ ఢిల్లీకి క్యాన్సర్ రోగులు వెళ్తున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖవేదికగా సూపర్‌హిట్ అయిందని, ప్రజల సహకారంతో చరిత్ర సృష్టించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.