Pawan Kalyan Reaction: బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:53 PM
శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా సంగెం మండలం పెరమన జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.
అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా సంగెం మండలం పెరమన జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డుప్రమాదం (Nellore road accident)పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై పవన్ కల్యాణ్ స్పందించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉందని తెలిసి పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాంగ్ రూట్ లో వచ్చిన టిప్పర్... కారును ఢీకొట్టడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ అన్నారు.
ఇసుక, కంకర లాంటివి తరలించే వాహనాలు మితిమీరిన వేగంతో, రాంగ్ రూట్లలో వెళ్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారని.. వాటిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని పవన్ సూచించారు (Pawan Kalyan reaction). మరోవైపు చిత్తూరు జిల్లా పుంగనూరులోని భాష్యం స్కూల్‌లో విద్యార్థినిని ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టి గాయపరచడంపైనా పవన్ స్పందించారు. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని సాత్విక నాగశ్రీ తలపై ఉపాధ్యాయుడు కొట్టడం మూలంగా పుర్రె ఎముక చిట్లింది. తరగతి గదిలో అల్లరి చేస్తోందనే కారణంతో స్కూల్ బ్యాగ్ తో విద్యార్థిని తలపై ఉపాధ్యాయుడు కొట్టారు. ఆ బాలికకు బెంగళూరులో కుటుంబసభ్యులు వైద్యం చేయించి ఇంటికి తీసుకువచ్చారు (AP Deputy CM news).
ఈ ఘటన ఎంతో బాధాకరమైనదని, పాఠశాలల్లో విద్యార్థులను పాతకాలం మాదిరి దండించే విధానాన్ని విద్యావేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు అంగీకరించడం లేదని పవన్ కల్యాణ్ అన్నారు (Telugu news update). స్కూల్లో అయినా, ఇంట్లో అయినా పిల్లల అల్లరిని అదుపు చేసే క్రమంలో వారి మానసిక ధోరణులను ఉపాధ్యాయులు, తల్లితండ్రులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించానని పవన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
మీరు దీర్ఘాయుష్షుతో ఉండాలి.. ప్రధానికి పవన్ బర్త్‌డే విషెస్
Read Latest AP News And Telugu News