Home » NRI Latest News
మొత్తం 207 దేశాల్లో భారత సంతతి ప్రజలు ఉన్నారని కేంద్రం తాజాగా వెల్లడించింది. వీరిలో సగం మంది ఎన్నారైలు కాగా మిగతా సగం మంది పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గుర్తింపు ఉన్న వారని పేర్కొంది. గతేడాది ఎన్నారైలు భారత్కు సుమారు 135 బిలియన్ డాలర్ల నిధులు పంపించారని తెలిపింది.
60 రోజుల్లో హెచ్-1బీ వీసా స్పాన్సర్షిప్ ఉన్న జాబ్ తెచ్చుకోవాలనే మూర్ఖపు నిబంధన కారణంగా తన స్నేహితురాలు 8 ఏళ్ల తరువాత భారత్కు వెళ్లిపోతోందని ఓ అమెరికన్ ఆవేదన వ్యక్తం చేశారు. అతడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
అమెరికాలోని న్యూ హాంప్షైర్ నగరంలోని రివియర్ యూనివర్సిటీ ప్రాంగణంలో గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు స్థానిక గణేశ్ ఉత్సవ కమిటీ ఈ వేడుకలను వైభవంగా నిర్వహించింది.
తెలంగాణ వాసులు రాష్ట్రం బయట ఎక్కువ సంఖ్యలో ఉపాధి పొందుతోంది గల్ఫ్ దేశాలలో మాత్రమేనని మంత్రి గడ్డం వివేక్ పేర్కొన్నారు. గురువారం దుబాయ్లో మంత్రి మాట్లాడుతూ గల్ఫ్ దేశాలలోని తెలంగాణ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు.
వాట్సాప్ గ్రూపుల్లో కొందరు పెట్టే ఫేక్ సౌదీ జాబ్ ఆఫర్స్ బారిన పడి అక్కడి తెలుగు నిరుద్యోగ యువత ఏం చేయాలో తెలియని స్థితిలో కూరుకుపోతున్నారు. ఓవైపు అప్పుల భారం మరోవైపు భవిష్యత్తుపై అనిశ్చితి వెరసి ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళనతో కుమిలిపోతున్నారు.
జనరంజని రేడియో సంస్థ, శ్రీవేద గాయత్రి పరిషత్, సంగీత భారతీ న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో మెల్బోర్న్ నగరంలో అష్టావధాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అవధానార్చనా భారతి, కవిరాజహంస, శారదామూర్తి తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి చేసిన ఈ అవధాన కార్యక్రమానికి న్యూజిలాండ్ ప్రప్రథమ శతకకర్తగా రికార్డులు సాధించిన డా. తంగిరాల నాగలక్ష్మి సంచాలకురాలిగా నిర్వహించారు.
సిలికానాంధ్ర నూతన కార్యవర్గం తాజాగా ఏర్పాటయ్యింది. తొలిసారిగా మొత్తం మహిళలతో కూడిన నాయకత్వ బృందం ఏర్పడటంపై ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
అమెరికాలో నడి వీధిలో కత్తితో గట్కా ప్రదర్శన చేస్తున్న ఓ సిక్కు మతస్థుడిని లాస్ ఏంజెలెస్ పోలీసులు కాల్చి చంపారు. ప్రస్తుతం ఇది అమెరికాలో సంచలనం రేకెత్తిస్తోంది.
తానా బ్యాక్ ప్యాక్ కార్యక్రమంలో భాగంగా న్యూఇంగ్లాండ్లోని ఫ్రాంక్లిన్లోగల ఆరు పాఠశాలల్లో విద్యార్థులకు 200 పైగా బ్యాక్ ప్యాక్లను అందజేశారు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఫీనిక్స్, అరిజోనాలోని మెసా కన్వెన్షన్ సెంటర్లో వైభవోపేతమైన ‘ఆటా డే’ కార్యక్రమం చేపట్టింది. ఫ్యాషన్ షో, పిల్లల పోటీలు, ఫుడ్ ఫెస్టివల్ ఒక గొప్ప మెమొరీగా నిలిచాయి.