Share News

TTD Germany: మ్యూనిక్‌లో వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవం

ABN , Publish Date - Oct 25 , 2025 | 08:54 AM

పెద్ద సంఖ్యలో తెలుగు, తమిళ, కన్నడ ఇతర రాష్ట్రాల భక్తులు పాల్గొని, స్వామి-అమ్మవారి కళ్యాణం తిలకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. భక్తులకు టీటీడీ లడ్డు ప్రసాదం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం కళ్యాణ ప్రసాద భోజనమును అందించారు.

TTD Germany: మ్యూనిక్‌లో వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవం
TTD Germany

జర్మనీ దేశములోని మ్యూనిక్ నగరంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్‌ నాన్-రెసిడెంట్‌ తెలుగు సొసైటీ(APNRT) సంయుక్త సహకారంతో తెలుగు అసోసియేషన్ జర్మనీ ఆధ్వర్యంలో శివాలయం మ్యూనిక్ మద్దతుతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లయ్య పర్యవేక్షణలో టీటీడీ అర్చక స్వాముల బృందం సుప్రభాతం, తోమాల సేవ, అర్చనలతో ఆరంభించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలతో మంగళవాయిద్యాల మధ్య శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కళ్యాణమహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగు, తమిళ, కన్నడ ఇతర రాష్ట్రాల భక్తులు పాల్గొని, స్వామి-అమ్మవారి కళ్యాణం తిలకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. భక్తులకు టీటీడీ లడ్డు ప్రసాదం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం కళ్యాణ ప్రసాద భోజనమును అందించారు. 'మ్యూనిక్‌లో మూడు సంవత్సరాలు తరువాత జరుగుతున్న ఈ కళ్యాణోత్సవం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించగలగడం మాకు లభించిన గొప్ప అదృష్టం' అని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సహకరించిన అందరికీ వారు కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కృపతో భక్తులందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

2.jpg


ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తెలుగు అసోసియేషన్ జర్మనీ(TAG) అధ్యక్షుడు నరేష్ కోనేరు, వెంకట్ కండ్ర, శివాలయం ప్రతినిధులు శర్మ ఆర్యసోమయాజుల, పవన్ భాస్కరతో పాటు టిట్టు మద్దిపట్ల, శివ నక్కల, విద్యాసాగర్ రెడ్డి, వికాస్ రామడుగు, రవి పేరిచర్ల, కళ్యాణ్ దుల్ల, అశోక్ మద్దిరెడ్డి, లీల మనోరంజన్, కిషోర్ నీలం, శ్రీనివాస రెడ్డి ఉమ్మెంతల, బాల అన్నమేటి, శ్రీకాంత్ సుంకర, దామ శ్రీనివాసులు, హరి రెడ్డి, ప్రియాంక సన్నారెడ్డి, బాబు రమేష్ నూకాల అవిశ్రాంతంగా కృషి చేశారు. యూరప్ ప్రధాన కోఆర్డినేటర్ డా. కిషోర్ బాబు చలసాని సారధ్యంలో డా. శ్రీకాంత్, సుమంత్ కొర్రపాటి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం విజయవంతంగా సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

3.jpg


ఇవి కూడా చదవండి:

Kurnool Fire Accident: కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!

Minister Sandhya Rani: గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి చర్యలు

Updated Date - Oct 25 , 2025 | 08:54 AM