Share News

Indian Man Moonlighting: ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరో జాబ్.. యూఎస్‌లో భారత సంతతి వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్షకు ఛాన్స్

ABN , Publish Date - Oct 24 , 2025 | 08:56 PM

న్యూయార్క్‌లో ప్రభుత్వోద్యోగం చేస్తున్న ఓ భారత సంతతి వ్యక్తి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని ఆసరాగా చేసుకుని రెండో జాబ్ చేస్తూ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అతడిపై మోపిన అభియోగాలు రుజువైతే గరిష్ఠంగా 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Indian Man Moonlighting: ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరో జాబ్.. యూఎస్‌లో భారత సంతతి వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్షకు ఛాన్స్
Mehul Goswami case

ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ భారత సంతతి వ్యక్తి వర్క్ ఫ్రమ్ హోంను అవకాశంగా మలుచుకుని మరో జాబ్ చేసి (మూన్‌లైటింగ్) చిక్కుల్లో పడ్డాడు. అతడికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. న్యూయార్క్‌లోని భారత సంతతి వ్యక్తి మేహుల్ గోస్వామిని ఇటీవల పోలీసులు మూన్‌లైటింగ్ చేసినందుకు అరెస్టు చేశారు. ప్రస్తుతానికి అతడు విడుదలైనప్పటికీ నేరం రుజువైతే 15 ఏళ్ల కారాగార శిక్ష పడే అవకాశం ఉంది (Moon Lighting In USA).

స్థానిక మీడియా కథనాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఐటీ సర్వీసెస్ విభాగంలో మేహుల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌గా చేసేవాడు. 2022లో అతడు వర్క్ ఫ్రమ్ హోం అవకాశాన్ని దుర్వినియోగపరిచి మాల్టా దేశంలోని ఓ సెమీ కండక్టర్ కంపెనీకి కాంట్రాక్టర్‌గా సేవలందించాడు. ప్రభుత్వ ఉద్యోగ వేళల్లోనే అతడు మాల్టా కంపెనీ కోసం పనిచేశాడు. దాదాపు రూ.40 లక్షల మేర సంపాదించాడు. చివరకు ఓ గుర్తు తెలియని వ్యక్తి న్యూయార్క్ ప్రభుత్వానికి సమాచారం అందించడంతో మెహుల్ అడ్డంగా బుక్కయిపోయాడు (Indian Origin man In NY Faces 15 year Jail term).


మేహుల్ చర్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వ విధుల చేయాల్సిన వ్యక్తి మరో జాబ్ చేయడం ప్రజా పన్నులను దుర్వినియోగ పరచడమేనని స్పష్టం చేసింది. అక్టోబర్ 15న అతడిని అరెస్టు చేసింది. అయితే, మేహుల్‌ను కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని కోర్టు భావించడంతో అతడికి తాత్కాలిక ఊరట లభించింది. అయితే, ఈ కేసులో అతడు దోషిగా తేలితే 15 ఏళ్ల వరకూ కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. ఇక 2024లో మేహుల్ ప్రభుత్వం నుంచి 117,841 డాలర్ల వార్షిక వేతనం పొందాడు.


ఇవీ చదవండి..

చంద్రబాబు యూఏఈ పర్యటన.. దుబాయ్‌లో సీఎంకు ఘన స్వాగతం

వార్సాలో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం!

Read Latest and NRI News

Updated Date - Oct 24 , 2025 | 09:20 PM