Share News

Brunei: బ్రూనైలో దీపావళి.. తెలుగు సంఘం ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు

ABN , Publish Date - Oct 23 , 2025 | 07:12 PM

బ్రూనై తెలుగు సంఘం దీపావళి పండుగను పురస్కరించుకుని పలు సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహించింది. సామాజిక సేవ కార్యక్రమాలు ఈ పండుగను మరింత అర్థవంతంగా మార్చాయని సంఘం అధ్యక్షుడు పేర్కొన్నారు.

Brunei: బ్రూనైలో దీపావళి.. తెలుగు సంఘం ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు
Brunei Telugu Association

బందర్ సెరి బేగావాన్, అక్టోబర్ 20: బ్రూనై దారుస్సలాం తెలుగు సంఘం.. ఈసారి దీపావళి పండుగను దాతృత్వం, సేవా కార్యక్రమాలతో మేళవించింది. దీపావళిని పురస్కరించుకునంది విల్లేజ్ పందాన్ బి ప్రాంతంలోని పాదచారుల మార్గంలో సమాజ శుభ్రత కార్యక్రమాన్ని సంఘం సభ్యులు నిర్వహించారు. మూడు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి బృందం ఏడు ట్రక్కుల వ్యర్థ పదార్థాలను సేకరించి, టెలిసాయ్ రీసైక్లింగ్ సెంటర్‌కు తరలించింది (Diwali Brunei Social Service Event).

ఈ కార్యక్రమానికి సొమునాయుడు దాది, సతీష్ పొలమత్రసెట్టి నాయకత్వం వహించారు. రమేష్ బాబు బదరవూరి, చింత వెంకటేశ్వరరావు మద్దతు అందించారు. పనగా బి గ్రామాధ్యక్షుడు మహమ్మద్ రవియాని బిన్ మోర్నీ నేతృత్వంలోని ఎమ్‌పీకే బృందం కార్యక్రమాన్ని సమన్వయ పరిచింది.

6.jpg


ఈ సందర్భంగా తెలుగు సంఘం.. రిపాస్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వద్ద రక్తదాన శిబిరం కూడా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. మొత్తం 24 యూనిట్ల రక్తం సేకరించారు. ఈ కార్యక్రమాన్ని నవీన్ కుమార్ సురపనేని సమన్వయం చేశారు. కొంతమంది సభ్యులు ఆరోగ్య కారణాల వల్ల తమ రక్తదాన శిబిరానికి హాజరు కాలేకపోయారు.

ఈ సేవా కార్యక్రమాలకు భారత రాయబారి హిజ్ ఎక్సలెన్సీ రాము అబ్బగాని, పుష్పా అబ్బగాని హాజరయ్యారు. సంఘం సభ్యులను అభినందించి, సేవా కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించారు. తెలుగు సంఘం అధ్యక్షుడు వెంకటరమణ రావు సూర్యదేవర మాట్లాడుతూ దీపావళి పండుగ ఆత్మీయత, వెలుగు, దాతృత్వానికి ప్రతీక అని అన్నారు. సమాజానికి సేవ చేయడం, శుభ్రతా కార్యక్రమాలు, రక్తదానం వంటి చర్యలు ఈ పండుగను మరింత అర్థవంతంగా మారుస్తాయని అన్నారు. సభ్యుల ఉత్సాహం, సేవా తత్పరత సంఘానికి గర్వకారణమని వ్యాఖ్యానించారు.

2.jpg3.jpg4.jpg1.jpg


ఇవీ చదవండి..

కెనడాకు తగ్గిన అంతర్జాతీయ విద్యార్థులు.. మునుపెన్నడూ చూడని విధంగా..

చంద్రబాబు యూఏఈ పర్యటన.. దుబాయ్‌లో సీఎంకు ఘన స్వాగతం

Read Latest and NRI News

Updated Date - Oct 24 , 2025 | 04:41 PM