Share News

TANA: తానా న్యూజెర్సీ హైకింగ్ ఈవెంట్ విజయవంతం

ABN , Publish Date - Oct 26 , 2025 | 07:42 AM

శనివారం ఉదయం సౌర్లాండ్ మౌంటెన్ హైకింగ్ ట్రయిల్ హిల్స్ బరోలో తానా న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో హైకింగ్ ఈవెంట్ విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TANA: తానా న్యూజెర్సీ హైకింగ్ ఈవెంట్ విజయవంతం
TANA New Jersey hiking event

ఇంటర్నెట్ డెస్క్: ఆహ్లాదకరమైన వాతావరణంలో, తానా న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో హైకింగ్ ఈవెంట్ విజయవంతమైంది. శనివారం ఉదయం సౌర్లాండ్ మౌంటెన్ హైకింగ్ ట్రయిల్ హిల్స్ బరోలో జరిగిన ఈ ఈవెంట్‌లో 100 మందికి పైగా పాల్గొని ప్రకృతిలో నడకను ఆస్వాదించారు. ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, ప్రకృతితో బంధాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

‘మన యువత – మన వారసత్వం’ అనే నినాదాన్ని గుర్తు చేస్తూ, యువత ఈ కార్యక్రమానికి ముందుండి నేతృత్వం వహించినందుకు తానా నాయకత్వం ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ తరహా కార్యక్రమాలు అమెరికాలో భారత (తెలుగు వాళ్ళ) వారసత్వాన్ని, సాంస్కృతిక విలువలను, సేవా కార్యక్రమాలను పెంపొందించడంలో ఎంతగానో దోహదపడతాయని పేర్కొంది. తానా యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి, హైకింగ్ కోఆర్డినేటర్ దశరథ తలపనేని.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రతిఒక్కరి ఉత్సాహం వల్లే ఈ కార్యక్రమం విజయవంతమైంది’ అని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న తానా లీడర్షిప్ ఫౌండేషన్ ట్రస్టీలు శ్రీనివాస్ ఒరుగంటి, సతీష్ మేకా, న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి సుధీర్‌చంద్ నరేపాలేపు, కోశాధికారి రాజా కసుకుర్తిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

TANA HIking.jpg


వలంటీర్లు శ్యామ్ ప్రసాద్ అంబటి, శరత్ తాటిపాముల, రాజేష్ బాబు, వినయ్ కూచిపూడి, మధుకుమార్ పరిటాల, రవి చెరుకూరి, నిశాంత్ కొల్లి, భగత్ మారెళ్ల, రవి మోసం, రాజేష్ ముప్పూర్, అరవింద్ పీఠంపల్లి, వెంకట్ ఏట్రింతల, మూర్తి తమ్మినీడి, వసంత్ నాయుడు తన్న, కిరణ్ బాసన, భాను ప్రకాష్ నల్లమోతు, వెంకట పుసులూరి, శ్రీనివాస్ కురివెళ్ల, శివ ప్రసాద్ అతినారపు ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు.

ఈ ఈవెంట్‌లో పాల్గొన్న వారికి తానా అధ్యక్షులు నరేన్ కొడాలి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ లావు అభినందనలు తెలియజేశారు. స్థానిక నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆహార్ రెస్టారెంట్ వారు రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ అందించారు.

3.jpg


ఇవీ చదవండి..

చంద్రబాబు యూఏఈ పర్యటన.. దుబాయ్‌లో సీఎంకు ఘన స్వాగతం

వార్సాలో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం!

Read Latest and NRI News

Updated Date - Oct 26 , 2025 | 07:51 AM