Home » NRI Latest News
తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సహకారంతో, తెలుగు అసోసియేషన్ జర్మనీ ఆధ్వర్యంలో జర్మనీలోని మ్యూనిక్, కొలోన్ నగరాలలో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.
ఫీనిక్స్ యువత ఆధ్వర్యంలో జరిగిన నిధుల సేకరణ కార్యక్రమంలో దాతలు శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాల కోసం 145000 డాలర్ల విరాళాన్ని ప్రకటించారు.
భారత దేశ సంస్కృతి వైవిధ్యం, ప్రాచీన కళలు, సంపదను విదేశాలలో నివసిస్తున్న భావితరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో భారతీయ ఎంబసీ నిర్వహించిన ప్రవాసీ పరిచయ కార్యక్రమంలో గంగమ్మ జాతర ప్రదర్శన ఒక్క తెలుగువారినే కాదు ఇతర రాష్ట్రాల వారిని కూడా అశేషంగా ఆకట్టుకొంది.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తానా సాహిత్య విభాగం.. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాల సాహిత్య భేరిని నిర్వహిస్తుంది. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా బాల సాహితీవేత్తలకు ఆహ్వానం పలుకుతోంది.
న్యూజెర్సీలో తానా, కళావేదిక, గుడ్ వైబ్స్ సంయుక్త ఆధ్వర్యంలో చిత్ర గాన లహరి కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు సుమారు 2 వేల మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమం తమకు కాలేజీ రోజుల్ని గుర్తుకు తెచ్చిందని కామెంట్ చేశారు.
కార్మిక చట్టాలపై విదేశీయులకు అవగాహన కల్పించే కువైత్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ తాజాగా దేశంలోని వివిధ రాయబార కార్యాలయ ప్రతినిధులు, ప్రవాసీ సంఘాల ప్రతినిధులతో కలిసి మరో అవగాహన కార్యక్రమం నిర్వహించింది.
ఒమాన్‌లో తెలుగు వారు కార్తీక మాసం సందర్భంగా అత్యంత భక్తిశ్రద్ధలతో సహస్ర లింగార్చన చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానిక ఎన్నారైలు పాల్గొన్నారు.
సౌదీలో వివిధ ఎన్నారై సంఘాల ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్థానిక అరబ్ ప్రముఖులు, భారతీయ దౌత్యవేత్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ బీమా పథకంపై సౌదీలోని కేరళ వారికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ప్రవాసీ ప్రముఖులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సభలు, సమావేశాలపై సౌదీ అరేబియాలో నిషేధం ఉన్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సీఎం చంద్రబాబు దూబాయ్ పర్యటన సందర్భంగా పలువురు ఎన్నారై ప్రముఖులు ఆయనను కలిసి ఏపీ ప్రవాసాంధ్రుల సమస్యలను వివరించారు. ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.