Home » Nitish Kumar
ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినా, ఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినా నితీశ్ మాత్రం సీఎంగానే కొనసాగుతున్నారు. అయితే ఈసారి నితీశ్ పార్టీ గెలుపు కష్టమని చాలా మంది అంచనా వేశారు.
రాష్ట్రీయ జనతాదళ్‌పై విమర్శలు గుప్పిస్తూ, 2005లో తాను ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పుడు బిహార్ పరిస్థితి అతి దయనీయంగా ఉండేదని, బిహారీలంటేనే చిన్నచూపు చూసే పరిస్థితి ఉండేదని నితీష్ చెప్పారు.
బిహార్‌లో 2005కు ముందు నిరక్షరాస్యత, నిరుద్యోగత, వలసలు ఉండేవని, ఉన్నత విద్య కోసం ఒక్క మంచి విద్యాసంస్థ కూడా ఉండేది కాదని, యువత చీకట్లో మగ్గేదని నితీష్ తెలిపారు. యువకులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ అవమానాలు పాలయ్యేవారని చెప్పారు.
పార్టీ అధికార ప్రకటన ప్రకారం, బహిష్కరణ వేటు పడిన నేతల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గోపాల్ మండల్, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ శ్యామ్ సింగ్, మాజీ మంత్రి శైలేష్ కమార్, మాజీ ఎమ్మెల్సీ సంజయ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
నితీష్ తరువాత మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టడంతో జనం తమ మొబైల్స్‌ను క్లిక్‌మనిపించారు. వెంటనే మోదీ చిరునవ్వులు చిందిస్తూ... ఇంతగా వెలుగులు విరజిమ్ముతుంటే ఎవరికైనా లాంతర్లు (ఆర్జేడీ గుర్తు) అవసరమవుతాయా? అని ప్రశ్నించారు.
బిహార్ మహాఘట్‌బంధన్.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను అధికారికంగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే మాటల యుద్ధం మొదలైంది. ఆర్జేడీ నేత అయిన తేజస్వి సవాలుకు ఎన్డీయే నేతలు అంతే రేంజ్ లో విమర్శలు గుప్పించారు.
బిహార్‌లో గత ప్రభుత్వాల హయాంలో శాంతిభద్రతులు, విద్య, మౌలిక వసతులు దయనీయంగా ఉండేవని, తమ నాయకత్వంలో బీహార్‌లో గణనీయంగా మార్పులు చోటుచేసుకున్నాయని నితీష్ కుమార్ చెప్పారు. మెరుగైన రోడ్లు, విద్యుత్, శాంతిభద్రతలు, ప్రజల మధ్య సామరస్యం పాదుకొల్పామని అన్నారు.
నితీష్ ఆరోగ్యంపై తేజస్వి కామెంట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమంలో నితీష్ కుమార్ తన నివాసం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. టీవీ స్క్రీన్‌లో మోదీ వైపు చూస్తూ తన రెండు చేతులను జోడిస్తూ నితీష్ ఉండిపోయారు.
నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ (యునైటెడ్) 40 మంది ప్రముఖలతో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను శుక్రవారం నాడు విడుదల చేసింది. నితీష్ కుమార్‌తో పాటు సీనియర్ నేతలు సంజయ్ కుమార్ ఝా, రాజీవ్ రంజన్ సింగ్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
జాతీయ ప్రజాస్వామ్య కూటమి బిహార్‌లో నితీష్ కుమార్ సారథ్యంలో ఎన్నికలు వెళ్తోందని అమిత్‌షా ఇప్పటికే ధ్రువీకరించారు. ఎన్నికల ప్రచారానికి కూడా ఆయనే సారథ్యంం వహిస్తారని చెప్పారు.