Bihar Elections : NDAకు తేజస్వి సవాలు.. అది 'తుగ్‌బంధన్' అంటూ బీజేపీ కౌంటర్
ABN , Publish Date - Oct 23 , 2025 | 08:28 PM
బిహార్ మహాఘట్‌బంధన్.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను అధికారికంగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే మాటల యుద్ధం మొదలైంది. ఆర్జేడీ నేత అయిన తేజస్వి సవాలుకు ఎన్డీయే నేతలు అంతే రేంజ్ లో విమర్శలు గుప్పించారు.
అక్టోబర్ 23, 2025: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. మహాఘట్‌బంధన్ (ఇండియా బ్లాక్) తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను అధికారికంగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే, ఆర్జేడీ నేత అయిన తేజస్వి సంచలన వ్యాఖలు చేశారు. అంతేకాదు, NDAకు సవాలు విసిరారు.
పట్నాలో జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో కలిసి మాట్లాడిన తేజస్వి.. 'NDA ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. వారికి ముందుచూపు లేదు, అజెండా లేదు. ఇవి అమిత్ షా మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీతీష్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు' అని తేజస్వి యాదవ్ విమర్శించారు. తన ఏకైక కల బిహార్‌ను దేశంలో నంబర్ వన్ చేయడమేనని.. 2.6 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు.

తేజస్వి యాదవ్ చేసిన సవాలుకు బీజేపీ వెంటనే తీవ్ర ప్రతిస్పందన ఇచ్చింది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, మహాఘట్‌బంధన్ ను 'తుగ్‌బంధన్'(తుగ్‌లక్ బంధన్) అంటూ ఎద్దేవా చేశారు. 'లాలూ యాదవ్ తన కుమారుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం ఆశ్చర్యం కాదు. ఇది ఘట్‌బంధన్ కాదు, తుగ్‌బంధన్ అని ఆయన విమర్శించారు. అంతేకాదు, నీతీష్ కుమార్ NDA ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా ఆయన పేర్కొన్నారు.
ఇక, బీజేపీ నాయకుడు కేశవ ప్రసాద్ మౌర్య, మహాఘట్‌బంధన్‌ను 'మహాతుగ్‌బంధన్' అంటూ ఎద్దేవా చేశారు. తేజస్వి ప్రకటనలు ఖాళీ మాటలు మాత్రమేనని.. వారు బిహార్‌ను 'జంగిల్ రాజ్'కు తిరిగి తీసుకెళ్తారని ఆయన విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
Tejashwi Yadav: డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో రాష్ట్రంలో అవినీతి: తేజస్వి యాదవ్
MNM leader Snehan: అసెంబ్లీ ఎన్నికలు.. భీకర యుద్ధమే