Home » Nirmala Sitharaman
2024-25లో రక్షణ బడ్జెట్ రూ.6.22 లక్షల కోట్లు ఉండగా.. కొత్త బడ్జెట్‌లో రూ.6.81 లక్షల కోట్లకు (9.53%) పెంచారు. అయితే ఇది చాలా తక్కువని విమర్శలు వస్తు న్న నేపథ్యంలో నిర్మల ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. రక్షణ బడ్జెట్ ప్రత్యేకతను అర్థం చేసుకోవాలన్నారు.
Budget 2025 Updates: ఏటా బడ్జెట్‌కు ముందు వేతన జీవుల ఎదురుచూపులు! కనీసం ఈసారైనా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంచుతారా అని! అయినా.. బడ్జెట్లో వారికి నిరాశ తప్పేది కాదు! ఈసారి కూడా బడ్జెట్‌కు ముందు రకరకాల ఊహాగానాలు! ఆదాయపు పన్ను పరిమితిని రూ.10 లక్షల దాకా పెంచవచ్చంటూ అంచనాలు! ఐనా.. ఎక్కడో అనుమానం.. ఈసారి కూడా ఊరట ఉండదేమోనని!
కేంద్ర బడ్జెట్‌లో గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad)కు నిరాశే ఎదురైంది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు రూ.4వేల కోట్లు, మురుగు సీవరేజ్ నిర్వహణ మాస్టర్ ప్లాన్ కోసం రూ.17,212 కోట్లు కోరితే రూపాయి కూడా విదల్చలేదు. మెట్రో రెండో దశ డీపీఆర్‌కు అనుమతి ఇచ్చి రూ.24,269 కోట్లలో తనవంతు వాటా 18 శాతం నిధుల ఊసెత్తలేదు.
‘ఈ బడ్జెట్ ద్వారా ఎన్డీయే సర్కార్ రైతు పక్షపాత ప్రభుత్వమని రుజువైంది. రూ.50,65,345కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.1,71,437 కేటాయించి...
‘కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్... సమగ్ర, సమ్మిళిత బ్లూ ప్రింట్.
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మళ్లీ మొండిచెయ్యే ఎదురైంది. హైదరాబాద్ చుట్టుపక్కల చేపట్టనున్న ప్రాజెక్టులు.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాఽధాన్యమైన ప్రాజెక్టులకు నిధులు, అనుమతుల మంజూరు కోరుతూ ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసినా దేనికీ నిధులివ్వలేదు.
Minister Savitha: సీఎం చంద్రబాబు కృషి ఫలితంగానే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అధిక నిధులు కేటాయించారని మంత్రి సవిత తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా, యువతకు ఉపాధి అవకాశాలు అందించేలా కేంద్ర బడ్జెట్ ఉందని మంత్రి సవిత పేర్కొన్నారు.
నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌తో ఆర్థిక వృద్ధి పాతబాటలోనే నడక సాగిస్తుందని, 6 నుంచి 6.5 శాతానికి మించదని ఆయన జోస్యం చెప్పారు. ఆర్థిక వృద్ధిపై సీఏఈ 8 శాతం అంచనాలను చేరుకోలేదన్నారు.
Pawan Kalyan: రైతులు, మహిళలు, మధ్యతరగతి, యువత... ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇస్తున్న అండదండలు కేంద్ర బడ్జెట్‌లోనూ కొనసాగిందని చెప్పారు.
వరసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలమ్మ ఈ సారి కూడా ప్రత్యేకమైన చీర ధరించారు. బడ్జెట్ సమర్పించేటప్పుడు నిర్మలమ్మ చెప్పే విషయాలతో పాటు ఆమె కట్టిన చీర కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..