Home » Nepal
నేపాల్ జల విలయంలో గల్లంతైన, ఇరుక్కుపోయిన వారిలో కొందరు తెలుగు ప్రవాసులు కూడా ఉన్నారు. నేపాల్-టిబెట్ సరిహద్దులో వీరి సెల్ ఫోన్లు కూడా పని చేయకపోవడంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
వరదలతో అతలాకుతలమైన నేపాల్‌కు మరో ముప్పు పొంచివుంది. మరో 72 గంటల్లో బ్యారియర్ సరస్సు పొంగిపొర్లి వరదలు ముంచెత్తే అవకాశం ఉందని నేపాల్‌ను చైనా హెచ్చరించింది.
నేపాల్-టిబెట్ సరిహద్దు వద్ద వరదల కారణంగా 552 మంది మరణించారు. 547 మంది మృతుల వివరాలను నేపాల్ ప్రకటించగా మరో ఐదు మరణాల గురించి చైనా మీడియా వెల్లడించింది.
నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, భవనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోతుండగా.. ఓ ఇంట్లో ఉన్న కుటుంబం మాత్రం సురక్షితంగా బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నేపాల్‌లో పలు ప్రాంతాల్లో వచ్చిన వరదల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు గల్లంతయ్యారు. వారిలో.. పార్వతీపురానికి చెందిన ఎన్ఆర్ఐ కుటుంబం గల్లంతైంది. అలాగే, కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన చొప్పరపు రమేశ్ కూడా గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
నేపాల్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన విశాఖ వాసులు అదృష్టవశాత్తూ జలప్రళయం నుంచి తప్పించుకున్నారు. వరద బీభత్సానికి ఒక్కరోజు ముందే వాళ్లు భారత్‌కు రావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
నేపాల్‌లో మరోసారి వరదలు వచ్చే అవకాశం ఉందని నేపాల్ పోలీస్ హెడ్ క్వాటర్స్ తెలిపింది. సహాయక చర్యల్లో పాల్గొన్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది.
టిబెట్-నేపాల్ సరిహద్దులో ప్రకృతి విపత్తులు విలయతాండవం చేస్తున్నాయి. భారీ వరదలకు ఇప్పటివరకు 469 మంది మృతిచెందగా.. 1,500 మందికి పైగా గల్లంతయ్యారు. ఇలాంటి వేళ చైనా ప్రభుత్వం మరో బాంబులాంటి వార్తను తెలియజేసింది.
చైనాలో భూకంపం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం దక్షిణ చైనా, సిచువాన్ ప్రావిన్ష్‌లోని లాంగ్‌చాంగ్ సిటీలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది.
ఆంగ్ల భాషపై అసాధారణ పట్టు, అరుదైన పద ప్రయోగాలతో ఆకట్టుకునే శశిథరూర్‌కు.. అదే శైలితో పేరొందిన నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే ఎదురయ్యారు. ఒకే వేదికపై కలిసిన ఈ ఇద్దరి మధ్య సాగిన చమత్కార సంభాషణ ప్రేక్షకులను అలరించింది.