Minister Nara Lokesh: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారితో మంత్రి లోకేష్ వీడియో కాల్

ABN, Publish Date - Sep 10 , 2025 | 12:59 PM

నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సచివాలయంలో వార్ రూమ్ ఏర్పాటు చేశారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ సెంటర్‌కు వెళ్లిన మంత్రి నారా లోకేష్.. అధికారులతో సమావేశమయ్యారు.

నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సచివాలయంలో వార్ రూమ్ ఏర్పాటు చేశారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ సెంటర్‌కు వెళ్లిన మంత్రి నారా లోకేష్.. అధికారులతో సమావేశమయ్యారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారి వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. మొత్తం 215 మంది తెలుగు వారు చిక్కుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం అందింది. తెలుగువారందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. అటు ఏపీ వారినీ నేపాల్‌ నుంచి తీసుకొచ్చేందుకు రెండు ప్రత్యేక విమానాలను సిద్ధం చేశారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Sep 10 , 2025 | 01:00 PM