Telangana Helpline for Nepal: నేపాల్ సంక్షోభం.. తెలంగాణ హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే..
ABN , Publish Date - Sep 10 , 2025 | 01:11 PM
నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. జెన్-జీ యువత చేపట్టిన నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారడంతో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. ఈ నేపధ్యంలో..
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ సంక్షోభం నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు సహాయం చేయడం, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం కోసం రేవంత్ సర్కార్ హెల్ప్‌లైన్ ప్రకటించింది.
ఇప్పటి వరకు లభించిన సమాచారం ప్రకారం, తెలంగాణ పౌరులెవరూ గాయపడినట్లు లేదా తప్పిపోయినట్లు సమాచారం లేదు. ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం సమన్వయంతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. పౌరుల భద్రత, త్వరితగతిన స్వదేశానికి తిరిగి వచ్చేలా చర్యలు చేపట్టింది.
తెలంగాణ పౌరులు లేదా వారి కుటుంబ సభ్యులు సహాయం అవసరమైతే ఈ కింది అధికారులను సంప్రదించవచ్చు:
వందన: రెసిడెంట్ కమిషనర్ & లైజన్ హెడ్ ప్రైవేట్ సెక్రటరీ +91 987199904
జి. రక్షిత్ నాయక్: లైజన్ ఆఫీసర్ +91 9643723157
సిహెచ్. చక్రవర్తి: పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ +91 9949351270.
Also Read:
హైకోర్టు తీర్పును సవాల్ చేయనున్న టీజీపీఎస్పీ
For More Latest News