Share News

TGPSC On Group 1 Mains: హైకోర్టు తీర్పును సవాల్ చేయనున్న టీజీపీఎస్పీ

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:28 PM

తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్‌ను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై..

TGPSC On Group 1 Mains: హైకోర్టు తీర్పును సవాల్ చేయనున్న టీజీపీఎస్పీ
TGPSC

హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్‌(Group 1 Mains)పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్‌ను రద్దు చేస్తూ జస్టీస్ నామావరపు రాజేశ్వరరావు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ విషయంపై హైకోర్టు తీర్పును తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్( Telangana Public Service Commission) సవాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం కమిషన్ కీలక సమావేశమై న్యాయపరమైన అంశాలు చర్చించాక తుది నిర్ణయం తీసుకోనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.


కాగా, ఏప్రిల్ నెలలో టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. అయితే, మ్యూలంకనంలో అవకతవకలు జరిగాయని కొంతమంది అభ్యర్థులు ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై విచారించిన న్యాయస్థానం అభ్యర్థుల వాదనలతో ఏకీభవించి మెయిన్స్ మెరిట్ లిస్ట్‌ను రద్దు చేయాలని సంచలన తీర్పు వెల్లడించింది. పేపర్లు రీ వాల్యూయేషన్ చేయాలని కుదరకపోతే మెయిన్స్ మరోసారి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే టీజీపీఎస్సీ హైకోర్టు తీర్పును సవాల్ చేయనున్నట్లు తెలుస్తోంది.


Also Read:

డిప్యూటీ సీఎం ఫొటోపై పిటిషన్.. కొట్టివేసిన హైకోర్ట్

జార్ఖండ్‌లో అనుమానిత ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్

For More Latest News

Updated Date - Sep 10 , 2025 | 12:44 PM