Share News

Ilaiyaraaja: 13న ఇళయరాజాకు సన్మానం

ABN , Publish Date - Sep 10 , 2025 | 11:55 AM

దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఈ నెల 13న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సన్మానించనుంది. 82 యేళ్ళ ఇళయరాజా పలు భారతీయ భాషల్లో అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.

Ilaiyaraaja: 13న ఇళయరాజాకు సన్మానం

చెన్నై: దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilaiyaraaja)కు ఈ నెల 13న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం(Tamilnadu State Governament) సన్మానించనుంది. 82 యేళ్ళ ఇళయరాజా పలు భారతీయ భాషల్లో అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. ఆయన చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో అగ్రనటులు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ తదితరులు హాజరుకానున్నారు.


nani4.2.jpg

వీరితో పాటు భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పాల్గొనేలా ప్రభుత్వం ఆహ్వానాలు పంపనుంది. అయితే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మాత్రం సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క సినీ కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో ఇళయరాజా గోల్డెన్‌ జూబ్లీ సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారా? లేదా? అన్నది సస్పెన్స్‌. నిజానికి ఇళయరాజా పుట్టిన రోజైన జూన్‌ 2న ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని భావించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

సీఎం రేవంత్‌ ఇంటి ప్రహరీ కూల్చివేత

Read Latest Telangana News and National News

Updated Date - Sep 10 , 2025 | 11:55 AM