Nepal Interim Government : నేపాల్‌లో సుశీలా కార్కీ మధ్యంతర ప్రభుత్వం!
ABN , Publish Date - Sep 10 , 2025 | 06:50 PM
నేపాల్‌లో యువత సాధించింది. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్న ప్రభుత్వాన్ని, జెన్ Z నిరసన పేరిట కూలదోసింది. ఇక ఇప్పుడు తమకు ఇష్టమైన నాయకురాల్ని దేశ పగ్గాలు చేపట్టాల్సిందిగా కోరుతోంది. నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ..
కాఠ్మాండూ, సెప్టెంబర్ 10 : నేపాల్‌లో యువత సాధించింది. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్న ప్రభుత్వాన్ని జెన్ Z (Gen Z) నిరసన పేరిట కూలదోసింది. ప్రధాని ఓలి దుబాయ్‌కు పారిపోవాలనుకునే పరిస్థితిని కల్పించి, మొత్తానికి అతని ప్రభుత్వాన్ని కూలదోసింది. ఇక ఇప్పుడు తమకు ఇష్టమైన నాయకురాల్ని దేశ పగ్గాలు చేపట్టాల్సిందిగా కోరుతోంది.
నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీని ఇంటరిం ప్రభుత్వానికి నాయకురాలిగా నియమించాలని దేశంలోని జెడ్ జడ్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాఠ్మాండూలో రెండు రోజుల పాటు కొనసాగిన తీవ్రమైన నిరసనల అనంతరం ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా దేశంలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. ప్రధాని ఓలి రాజీనామా అనంతరం దేశంలో యువత శాంతించింది.
మొత్తంగా నేపాల్ దేశంలో జరిగిన నిరసనలకు 19 మంది మరణించగా, 200కు పైగా మంది గాయపడ్డారు. ఈ నిరసనలు దేశంలో సోషల్ మీడియా నిషేధం, అవినీతి, ఆర్థిక సంక్షోభంపై యువత ఆగ్రహంతో మొదలైన సంగతి తెలిసిందే.
సుశీలా కార్కీ నేపథ్యం
సుశీలా కార్కీ 2016-2017 మధ్య నేపాల్ సుప్రీం కోర్ట్‌లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆమె తన పదవీకాలంలో అవినీతి, భ్రష్టాచారానికి ధైర్యంగా ఎదురు నిలిచి దేశప్రజలందరి మన్ననలు పొందారు. అయితే, 2017లో మావోయిస్ట్ సెంటర్, నేపాలీ కాంగ్రెస్ పార్టీలు ఆమెపై మహాభియోగ నిర్ణయాన్ని తీసుకురావడం వివాదాస్పదమైంది. కానీ ఆమె సుప్రీం కోర్ట్ ఆదేశాలతో దీనిని విజయవంతంగా ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆమె యువతలో నమ్మకం కలిగించే నాయకురాలిగా గుర్తింపు పొందుతున్నారు. జెన్ జడ్ యువత ఆమెను నేపాల్ ఇంటరిం లీడర్‌గా ఎంచుకోవడానికి కారణమైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
సీఎం రేవంత్ ఇంటి ప్రహరీ కూల్చివేత
Read Latest Telangana News and National News