Share News

Nepal Jailbreak: నేపాల్‌లో విధ్వంసం.. ఖైదీలకు వరంగా మారింది.. వారేం చేశారో తెలిస్తే..

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:30 PM

సోషల్ మీడియాపై నిషేధం కారణంగా నేపాల్ రాజధాని కఠ్మాండూ అట్టుడుకుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై యువత భారీ నిరసనకు, ఆందోళనకు దిగారు. విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నారు. యువతకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 17 మంది వరకూ చనిపోయినట్లు కథనాలు వస్తున్నాయి.

Nepal Jailbreak: నేపాల్‌లో విధ్వంసం.. ఖైదీలకు వరంగా మారింది.. వారేం చేశారో తెలిస్తే..
Nepal prison escape

సోషల్ మీడియాపై నిషేధం కారణంగా నేపాల్ (Nepal) రాజధాని కాఠ్మాండూ అట్టుడుకుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై యువత భారీ నిరసనకు, ఆందోళనకు దిగింది. యువకులు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నారు. యువతకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 17 మంది వరకూ చనిపోయినట్లు కథనాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 19 మంది మరణించారు. జనరేషన్ జెడ్ చేపట్టిన ఈ నిరసన అక్కడి ప్రభుత్వాన్ని కూల్చేసింది. ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిని కొట్టారు. అక్కడ పార్లమెంటుకు నిప్పు పెట్టారు (Nepal prison escape).


దేశంలో జరుగుతున్న ఈ విపత్తును అక్కడి ఖైదీలు తమకు అవకాశంగా మార్చుకున్నారు. పలు ప్రభుత్వ ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేస్తున్నారు. కొందరు బిర్గుంజ్ జైలులోకి ప్రవేశించి గేటు తెరిచారు. దీంతో ఆ జైలులోని ఖైదీలు బయటకు పారిపోయారు. జైలు గోడను పగలగొట్టి చాలా మంది ఖైదీలు అక్కడి నుంచి తప్పించుకున్నారు (Nepal jail wall break). నేపాల్‌లోని బిర్‌గుంజ్ జైలుతో పాటు, అనేక ఇతర జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకున్నారు.


నేపాల్‌లోని మహోతారి జైలు నుంచి 576 మంది ఖైదీలు, పోఖారా జైలు నుంచి ఇప్పటివరకు 900 మంది ఖైదీలు తప్పించుకున్నారు (prisoners escaped Nepal). బిర్‌గుంజ్ జైలు తలుపు తెరిచిన తర్వాత చాలా మంది ఖైదీలు బయటకు వెళ్లిపోయారు. అయితే వారి సంఖ్య ఎంతనేది ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. మొత్తానికి నేపాల్ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఖైదీలు జైళ్ల నుంచి బయటపడినట్టు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..


భారత ప్రధానితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..


మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 10 , 2025 | 12:30 PM