Home » Narendra Modi
అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. యువత ఉపాధికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమరావతి అవకాశాల కేంద్రంగా మారనుందన్నారు
ప్రధాని మోదీ అమరావతిలో జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందించామని చెప్పారు. అమరావతి, ఏపీని ఆధునాతన ప్రదేశ్‌గా మారుస్తుందన్నారు
అమరావతి కేవలం రాజధాని కాదు, ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మూడేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో రూ.49 వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించారు.
ప్రధాని మోదీని ధర్మవరం శాలువాతో సీఎం చంద్రబాబు సన్మానించారు. అలాగే, మచిలీపట్నం కళాకారులు రూపొందించిన మోదీ చిత్రంతో కూడిన కళారూపం ఆయనకు బహుకరించబడింది
ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికరమైన సంఘటన జరిగింది. పవన్ ప్రసంగం చేస్తున్నప్పుడు గొంతులో ఇబ్బంది వచ్చినప్పుడు మోదీ ఆయనకు విక్స్ ఇచ్చి గొంతు జాగ్రత్త వహించమని సూచించారు.
ప్రధాని మోదీ శుక్రవారం అమరావతిలో తెలుగు భాషలో ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధికి ఆయన పూర్తి సహకారం ప్రకటిస్తూ, ‘‘మనం చేయాలి, మనమే చేయాలి’’ అని అన్నారు
ప్రధాని మోదీకి వెలగపూడి హెలిప్యాడ్ వద్ద గవర్నర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వాయుసేన హెలికాప్టర్‌లో అమరావతికి చేరుకున్నారు
పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఐదు కోట్ల ఆంధ్రులు, దేశం మొత్తం మీ వెంట ఉందంటూ హిందీలో వ్యాఖ్యానించారు
ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో రూ.58 వేల కోట్ల విలువైన పనులు ప్రధాని మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభమయ్యాయి. వెలగపూడిలో లక్షలాది మంది తరలివచ్చి సందడి చేశారు
Narendra Modi: అమరావతి రాజధాని పున:ప్రారంభోత్సవ సభలో ప్రధాని మోదీ సీనియర్ ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్నారు. తాను, చంద్రబాబు, పవన్ కలిసి ఎన్టీఆర్ కలలు కన్న వికసిత్ ఆంధ్ర కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు.