Narendra Modi: NTR కల సాకారం చేస్తాం.. హామీ ఇచ్చిన ప్రధాని మోదీ
ABN , Publish Date - May 02 , 2025 | 06:27 PM
Narendra Modi: అమరావతి రాజధాని పున:ప్రారంభోత్సవ సభలో ప్రధాని మోదీ సీనియర్ ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్నారు. తాను, చంద్రబాబు, పవన్ కలిసి ఎన్టీఆర్ కలలు కన్న వికసిత్ ఆంధ్ర కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు.
అమరావతి రాజధాని పున:ప్రారంభోత్సవ సభలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సీనియర్ ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ కల సాకారం చేస్తామని అన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్టీఆర్ కలలు కన్నారు. నేను, చంద్రబాబు, పవన్ కలిసి వికసిత్ ఆంధ్ర కోసం కృషి చేస్తాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దుష్టగ్రహాలన్నీ పారిపోయాయి. చంద్రబాబు నాకు టెక్నాలజీ వాడకం గురించి చెప్పారు. చంద్రబాబును చూసే నేను టెక్నాలజీ తెలుసుకున్నా’ అని అన్నారు.
మోదీకి అండగా ఉంటాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో పహల్గామ్ ఉగ్రదాడి గురించి మాట్లాడారు. ఉగ్రవాదులను అణిచివేయటం కోసం ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అండగా ఉంటామని అన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ ముందుగా మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. గతంలో మోదీ గారెని ఎప్పుడు కలిసినా..
చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. కానీ, మొన్న అమరావతి కార్యక్రమానికి పిలవడానికి వెళ్లాను. ఆ మీటింగ్ చాలా గంభీరంగా సాగింది. ‘ నా దేశ ప్రజలు ఉగ్రవాదుల దాడిలో చనిపోయారు’ అన్న ఆవేదన మోదీ గారిలో చూశాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి మోదీ, కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మేము అండగా ఉంటాం’ అని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు
Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్