Share News

Modi Amaravati Welcome: ప్రధాని మోదీకి ఘనస్వాగతం

ABN , Publish Date - May 03 , 2025 | 04:48 AM

ప్రధాని మోదీకి వెలగపూడి హెలిప్యాడ్ వద్ద గవర్నర్‌, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వాయుసేన హెలికాప్టర్‌లో అమరావతికి చేరుకున్నారు

Modi Amaravati Welcome: ప్రధాని మోదీకి ఘనస్వాగతం

విజయవాడ, మే 2(ఆంధ్రజ్యోతి): రాజధానిలోని వెలగపూడిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్ద గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వేదిక వద్దకు వెళ్లారు. అంతకుముందు మధ్యాహ్నం 2.49 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్‌, సుభాష్‌ తదితరులు స్వాగతం పలికారు. వాయుసేన హెలికాప్టర్‌లో ప్రధాని మోదీ అమరావతికి బయలుదేరారు. సభ ముగిసిన తర్వాత వాయుసేన హెలికాప్టర్‌లో ప్రధానితో పాటు చంద్రబాబు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లారు.


ఇవి కూడా చదవండి

Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు

Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Updated Date - May 03 , 2025 | 04:48 AM