PM Modi: మనం చేయాలి మనమే చేయాలి
ABN , Publish Date - May 03 , 2025 | 05:08 AM
ప్రధాని మోదీ శుక్రవారం అమరావతిలో తెలుగు భాషలో ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధికి ఆయన పూర్తి సహకారం ప్రకటిస్తూ, ‘‘మనం చేయాలి, మనమే చేయాలి’’ అని అన్నారు
అచ్చ తెలుగులో ప్రధాని ‘అండ’
పలుమార్లు తెలుగులో మాట్లాడిన ప్రధాని
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘అందరికీ నమస్కారాలు’ అని తెలుగులో మొదలుపెట్టి... ఆ తర్వాత ప్రసంగాన్ని హిందీలో కొనసాగించడం షరా మామూలే! కానీ... శుక్రవారం ప్రధాని మోదీ ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. తెలుగులో మొదలుపెట్టి... మధ్యలోనూ పలుమార్లు తెలుగులో మాట్లాడారు. తెలుగు మాటలతోనే తన ప్రసంగాన్ని ముగించారు. రాష్ట్రాభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని తెలుగువారందరికీ అర్థమయ్యేలా... అచ్చ తెలుగులో చెప్పారు. ఇవీ ఆ వివరాలు... ‘‘తల్లి దుర్గా భవానీ కొలువైన ఈ పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందంగా ఉంది’’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘అమరావతి కేవలం ఒక నగరం కాదు... అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక ప్రదేశ్‌గా మార్చే శక్తి. ఆంధ్రప్రదేశ్‌ను అధునాత ప్రదేశ్‌గా మార్చే శక్తి’’... అని తెలుగులో మరోమారు ఉద్ఘాటించారు.
ఆ తర్వాత... నాడు ఎన్టీఆర్ అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ కోసం కలలుకన్నారని తెలిపారు. నేడు ఆంధ్రప్రదేశ్‌ను, అమరావతిని ‘వికసిత్ భారత్’కు గ్రోత్ ఇంజిన్‌లా మార్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ‘‘చంద్రబాబు గారు, బ్రదర్ పవన్ కల్యాణ్ ఇది మనము చేయాలి. ఇది మనమే చేయాలి’’... అని తెలుగులో. నొక్కి వక్కాణించారు. చివర్లో... ధన్యవాదాలు, భారత్ మాతాకీ జై, వందే మాతరం... నినాదాలతో ప్రసంగాన్ని ముగించారు.
ఇవి కూడా చదవండి
Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు
Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్