Home » Nandamuri Balakrishna
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణకు స్థానం దక్కడంతో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలయ్య మామయ్యకు అభినందనలు అని లోకేష్ పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వంలో ఏపీ వ్యాప్తంగా అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఉద్ఘాటించారు. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి 2019లో శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు. తర్వాత కొన్ని అంధకార పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారించిందని.. దీంతో తాము ఆస్పత్రి నిర్మాణ పనులు చేపట్టలేకపోయామని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ ద్వైవార్షిక మహాసభలను పురస్కరించుకుని నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టాంపా చేరుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ, మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది. మీ అభివృద్ధికి నూటికి నూరు శాతం తోడ్పాటునందిస్తుంది.
పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు పండుగలా జరుగుతున్నాయి. బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బసవతారకం హాస్పిటల్‌లో బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన లెజెండ్.. పొలిటికల్ స్క్రీన్‌పై ఆయన అన్‌స్టాపబుల్.. ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య.. నా ముద్దుల మావయ్య అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
Gaddar Awards: గద్దర్ ఫిల్మ్ అవార్డులపై ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ స్పందించారు. తమకు వచ్చిన అవార్డులపై వారు ఆనందం వ్యక్తం చేశారు.
Operation Sidoor: భారత్ - పాక్ యుద్ధ భూమిలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఎమ్మెల్యే బాలయ్య అండగా నిలిచారు. రేపు స్వగ్రామంలో జవాన్ అంత్యక్రియలు జరుగనున్నాయి.
Nandamuri Balakrishna: వైసీపీకి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే తాటతీస్తానని హెచ్చరించారు. హిందూపురం ప్రజలకు తాను అండగా ఉంటానని బాలకృష్ణ భరోసా కల్పించారు.
విజయవాడ ఏ కన్వెన్షన్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలను స్వయంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శించారు.