Home » Municipal elections
కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ చేతికి వెళ్తుందా లేదా కాంగ్రెస్‌కా? అనే విషయానికి దాదాపు తెరపడింది. కార్పొరేషన్‌లో గెలిచిన ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు బీజీపీ గూటికి చేరారు.
నిజామాబాద్ కార్పొరేషన్‌ను తామే కైవసం చేసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో శనివారం సమావేశం అవుతానని.. ఈ భేటీలో కార్పొరేషన్‌ల గురించి చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
కరీంనగర్ నగరపాలక సంస్థలో మేయర్ పదవిని దక్కించుకునేందుకు తెరవెనుక రాజకీయాలు వేడెక్కాయి. భారతీయ జనతా పార్టీని నిలువరించడమే లక్ష్యంగా ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో ఒక అరుదైన, ఆసక్తికరమైన మలుపుగా మారింది.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠగా సాగగా.. అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. కానీ కొత్తగూడెం కార్పొరేషన్‌లో విషయానికొస్తే అమాంతం పొలిటికల్ హీట్ పెరిగింది.
సత్తుపల్లి మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వ్ అయిన చైర్‌పర్సన్ పదవి -దక్కించుకునేందుకు ప్రధానంగా ముగ్గురు కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు. ఓట్ల లెక్కింపు ముగియగా.. సత్తుపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
మున్సిపల్ పరోక్ష ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే ఓటు వేయడానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా అర్హులు కారని చెప్పింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలలో 2,582 వార్డులకు గాను 2,581 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో కాంగ్రెస్ 1,349 వార్డులను కైవసం చేసుకుని 74 మున్సిపాలిటీలలో ఆధిపత్యం చాటింది.
తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల ఘట్టం ముగిసింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరిగిన పోరు కేవలం స్థానిక ఎన్నికలుగా కాకుండా.. భవిష్యత్తు రాజకీయ దిశను నిర్ణయించే పరీక్షగా మారింది. ఫలితాలు స్పష్టమయ్యాక ఇప్పుడు చర్చంతా ఒకటే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజమయ్యాయని. ఆ వివరాలను ఓసారి చూద్దాం..
అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి సత్తా చాటింది. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయ పరంపరను కొనసాగిస్తూ.. మునిసిపల్ ఎన్నికల్లోనూ తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది.
పంచాయతీ ఎన్నికల్లోనే కాదు.. మున్సిపల్ ఎన్నికల్లో సైతం అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది.