Home » Minister Satya Kumar
Minister Gottipati Ravi Kumar: విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా మారి ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం, పెనుకొండలో సోమవారం జరిగిన సంక్రాంతి సంబరాలలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, సవిత పాల్గొన్నారు.
Minister Satya Kumar: పేదలను మభ్యపెట్టి అవయవాలు తీసుకునే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్చరించారు. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన తీసుకురావడం అభినందనీయమని ప్రశంసించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు 5 బ్రెయిన్ డెడ్ కేసులు వస్తన్నాయని చెప్పారు.
Minister Satyakumar: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలతో బీజేపీ, టీడీపీ నేతల మధ్య ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో ఉండే మహిళల కోసం న్యూ ఇయర్ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు.
‘2024 ఎన్నికల్లో ఏపీ ప్రజలు ప్రజా, అభివృద్ధి వ్యతిరేక, దురహంకార, అవినీతి పాలనకు తగిన గుణపాఠం చెప్పారు.
Satya Kumar Yadav: తెలుగు భాష పరిరక్షణ కోసం కృషి చేస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు.ఆంగ్లం మాట్లాడితే తాము చాలా గొప్ప అనే భావన చాలా మందిలో ఉందని.. కానీ దేశ భాషలందు తెలుగు లెస్స అన్న రాజులెందరో ఉన్నారని గుర్తుచేశారు. రాజకీయంగా నేతల మధ్య సైద్ధాంతిక విబేధాలు ఉన్నా.. భాష కోసం అందరూ కలిసి నడవాలని మంత్రి సత్యకుమార్ సూచించారు.
భారత్‌ను క్షయ రహిత దేశంగా మార్చే లక్ష్యాన్ని చేరేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఏపీ పూర్తిగా సహకరిస్తుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు.
మాజీ సీఎం జగన్ అవినీతి రాష్ర్టానికే పరిమితం కాకుండా అమెరికా చేరిందని, తద్వారా అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జ్జించారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ చేసిన సూచనలను అనుసరించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్టం - 1986కు సవరణను ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.
ఏపీలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కాం పై అసెంబ్లీలో చర్చ జరిగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ అరబిందో సంస్థపై సంచలన ఆరోపణలు చేశారు. 108 సేవ ముసుగులో భారీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు.