Share News

Minister Satyakumar Yadav : ఏపీలో క్లినికల్‌ సైకాలజీ కోర్సులు

ABN , Publish Date - Feb 09 , 2025 | 04:05 AM

క్లినికల్‌ సైకాలజీ కోర్సుల్ని ప్రారంభింస్తున్నామని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఎక్స్‌ వేదికగా తెలిపారు.

Minister Satyakumar Yadav : ఏపీలో క్లినికల్‌ సైకాలజీ కోర్సులు

  • మార్గదర్శకాలు సిద్ధం చేయాలి: సత్యకుమార్‌

అమరావతి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తొలిసారిగా క్లినికల్‌ సైకాలజీ కోర్సుల్ని ప్రారంభింస్తున్నామని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఎక్స్‌ వేదికగా తెలిపారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర్థారణ, చికిత్స అందించడంలో క్లినికల్‌ సైకాలజిస్టులు కీలక పాత్ర వహిస్తారు. రిహేబిలిటేషన్‌లో కూడా ప్రధాన భూమిక వహిస్తారు. రాష్ట్రంలో ఈ రెండు కోర్సుల్ని వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు వీలుగా మార్గదర్శకాల్ని తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించా’ అని మంత్రి తెలిపారు.

Updated Date - Feb 09 , 2025 | 04:05 AM