Share News

చేసిన తప్పులకు మూల్యం తప్పదు: సత్యకుమార్‌

ABN , Publish Date - Feb 28 , 2025 | 03:59 AM

సభ్య సమాజం తలదించుకొనేలా మాట్లాడి ఇతరుల మనసులను గాయపరిచిన వారు మూల్యం చెల్లించక తప్పదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు.

చేసిన తప్పులకు మూల్యం తప్పదు: సత్యకుమార్‌

నందిగామ, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): సభ్య సమాజం తలదించుకొనేలా మాట్లాడి ఇతరుల మనసులను గాయపరిచిన వారు మూల్యం చెల్లించక తప్పదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. నందిగామలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై స్పందించారు. గత ప్రభుత్వ అండతో పోసాని చెలరేగిపోయాడని అన్నారు. బాధితుల ఫిర్యాదుతో ఆయన్ను అరెస్టు చేశార న్నారు. ఇంకా మిగిలిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పారు.

Updated Date - Feb 28 , 2025 | 03:59 AM