Minister Satya Kumar : స్మగ్లర్లపై సినిమా తీస్తే ఏం ఉపయోగం?
ABN , Publish Date - Feb 17 , 2025 | 03:37 AM
సత్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. శనివారం ఆయన నంద్యాల జిల్లా కేంద్రంలోని గురురాజా పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు వైరల్
నంద్యాల హాస్పిటల్, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): స్మగ్లర్ల మీద సినిమాలు తీయడం వల్ల సమాజానికి ఏం ఉపయోగమని మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. శనివారం ఆయన నంద్యాల జిల్లా కేంద్రంలోని గురురాజా పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ఓటీటీల్లో వస్తున్న సినిమాలు యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. పూలన్‌దేవి, వీరప్పన్ లాంటి స్మగ్లర్‌లపై సినిమాలు తీసి కోట్ల రూపాయలు గడిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి ముప్పే తప్ప ఎలాంటి ఉపయోగమూ లేదన్నారు. సమాజానికి ఉపయోగపడే మంచి సినిమాలు తీయాలని మంత్రి సూచించారు.