Home » Medaram Jatara
మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ భక్తులు ముందుగానే వెళుతుండడంతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతోంది. జాతర కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా.. జాతర సమయంలో భక్తలు పెద్దసంఖ్యలో విచ్చేయనుండడంతో.. ముందుగానే వెళుతున్న భక్తులు అమ్మవార్ల దర్శనానికి వెళుతున్నారు.
మేడారం జాతరకు కేసీఆర్‌ను అధికారికంగా ఆహ్వానించారు మంత్రులు సీతక్క, కొండా సురేఖ. ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన మహిళా మంత్రులు కేసీఆర్‌ను మేడారం మహా జాతరకు రావాలని ఆహ్వానపత్రిక అందించారు.
మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి సీతక్క కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను మంత్రి కలిసి మేడారం జాతరకు ఆహ్వానించనున్నారు.
జనవరి 28వతేదీ నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు బీహెచ్‌ఈఎల్ డిపో(ఆర్ సీ పురం) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుధా తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కాలనీలు, బస్తీల నుంచి స్థానికులు కలిసికట్టుగా మేడారం జాతరకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు ప్రత్యేక బస్సులు ఆయా కాలనీలకు పంపిస్తామని తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆమె మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానం పలికారు. రాష్ట్రపతికి సమ్మక్క తల్లి చీరను, కంకణం, కండువ బంగారాన్ని మంత్రులు అందజేశారు.
గిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్క-సారలమ్మ. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో కొలువై ఉన్న ఈ వనదేవతలకు రెండేళ్లకోసారి మహాజాతర జరగడం సంప్రదాయం. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మహాజాతరగా ఇది ఖ్యాతిని పొందింది.
మేడారంలో వనదేవతలు సమ్మక్క - సారలమ్మల గద్దెలు పున: నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మంత్రులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో గద్దెల పనులపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
మేడారం ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలయ పనులపై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
తన మీద సహచర మంత్రులు ఫిర్యాదు చేశారని నమ్మడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాను అంటే ఏంటో అందరికీ తెలుసునని తెలిపారు.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కొండా సురేఖ మధ్య మేడారం ఆలయ టెండర్ల వార్ నడుస్తోంది. మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్‌రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.