Home » Medaram Jatara
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు తేదీ దగ్గర పడుతుండడంతో గ్రామాలు, పట్టణాల్లో బెల్లం కొనుగోళ్లు ముమ్మరం జరుగుతున్నాయి. ఈనెల 28,29,30,31 తేదీల్లో మహాజాతర జరుగుతున్నతన విషయం తెలిసిందే. అయితే.. బంగారంగా పలిచుకునే బెల్లం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
మేడారంలో భక్తుల రద్దీ నియంత్రణకు ఏఐ వినియోగిస్తున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా రూట్‌మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారాయన. సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్‌కి అనుసంధానించి రద్దీని నియంత్రిస్తున్నట్లు వివరించారు.
మేడారం మహాజాతరకు తేదీ దగ్గరపడుతోంది. అయితే.. పెద్దసంఖ్యలో విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు సింగరేణి యాజమాన్యం కూడా సిద్ధమైంది. అటు సింగరేణికి చెందిన రెస్క్యూ, స్విమ్మర్స్, స్కౌట్స్ సిబ్బంది మేడారంలో సేవలందించనున్నారు.
మేడారం.. భక్తజన గూడారంగా మారుతోంది. జాతర తేదీ దగ్గరపడుతున్నాకొద్దీ భక్తులు పెద్దసంఖ్యలో చేరుకొని మొక్కులు సమర్పించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే లక్షకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అంచనా.
మేడారం మహాజాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారిత డ్రోన్ వ్యవస్థ, జియో ట్యాగింగ్ ట్రాకింగ్ సిస్టంతో పాటు 13వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి తమ మొక్కులను చెల్లంచుకుంటున్నారు. ఈనెల 28 నుంచి మహా జాతర జరగనున్న సంగతి తెలిసిందే. అయితే.. అప్పటికీ భక్తులు పెద్దసంఖ్యలో ఉంటారనే భావనతో ముందస్తుగానే విచ్చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మేడారం.. భక్తులతో కిటకిటలాడుతోంది. జాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఆ సమయంలో భక్తులు ఎక్కువగా ఉంటారనే భావనతో చాలామంది ముందస్తుగా విచ్చేసి తమతమ మొక్కులను సమర్పించుకుంటున్నారు. దీంతో మేడారం.. భక్తజన గూడారంగా మారుతోంది.
మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. ఈనెల 28, 29, 30, 31 తేదీల్లో మహాజాతర జరగనుండగా భక్తులను తరలించేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తం అవుతున్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు తేదీ దగ్గరపడుతున్నా కొద్దీ ఆయా పనులు ధరవేగంగా జరుగుతున్నాయి. కాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతరకు విచ్చేయనుండడంతో.. ఆయన వచ్చే దారికి మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీ దగ్గరపడ్డ తరుణంలో వివిధ పనులన్నీ పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ఈనెల 28, 29, 30 తేదీల్లో మహా జాతర జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.