Share News

Medaram: మేడారంలో.. సీఎం వచ్చే దారికి మరమ్మతులు

ABN , Publish Date - Jan 13 , 2026 | 01:08 PM

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు తేదీ దగ్గరపడుతున్నా కొద్దీ ఆయా పనులు ధరవేగంగా జరుగుతున్నాయి. కాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతరకు విచ్చేయనుండడంతో.. ఆయన వచ్చే దారికి మరమ్మతు పనులు జరుగుతున్నాయి.

Medaram: మేడారంలో.. సీఎం వచ్చే దారికి మరమ్మతులు

తాడ్వాయి(ములుగు): సమ్మక్క- సారలమ్మలను దర్శించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Chief Minister Revanth Reddy) వచ్చే కొత్త దారికి అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. సీఎం నేరుగా హెలీప్యాడ్‌ నుంచి కాన్వాయ్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ మీదుగా దేవస్థానం ముందు ప్రధాన ద్వారం వద్దకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో సీఎం వచ్చే దారికి భక్తుల క్యూలైన్‌గా మార్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. దీంతో సీఎం రాకతో భక్తుల దర్శనాలు నిలిపివేసి వారు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా కొత్త దారిని ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.


sammkk3.jpg

స్నానఘట్టాలకు పెయింటింగ్‌..

తాడ్వాయి: మహాజాత రకు మేడారం వచ్చే భక్తుల సౌకర్యాల్లో భాగంగా స్నాన ఘట్టాలకు అధికారులు పెయింటింగ్‌ పనులు ప్రారంభించారు. మెట్లు శుభ్రంగా ఉండే విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

భక్తులకు ఉచితంగా తాగునీరు..

తాడ్వాయి: సమ్మక్క- సారలమ్మలను దర్శించుకోవ డానికి తరలివచ్చే భక్తులకు అధికారులు ఉచితంగా తాగు నీరు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ట్రాక్టర్‌ ద్వారా ట్యాంకులు ఏర్పాటు చేసి అందజేస్తున్నారు.


sammak1.2.jfif

ఈ వార్తలు కూడా చదవండి.

వందేభారత్‌ స్లీపర్‌లో నో ఆర్‌ఏసీ

‘తుంగభద్ర’ గేటు ట్రయల్‌రన్‌ సక్సెస్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 13 , 2026 | 01:08 PM