Share News

Medaram Special Buses: మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Jan 17 , 2026 | 11:58 AM

మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. ఈనెల 28, 29, 30, 31 తేదీల్లో మహాజాతర జరగనుండగా భక్తులను తరలించేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తం అవుతున్నారు.

Medaram Special Buses: మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు

వరంగల్: ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహోత్సవం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. ఇంటిల్లిపాది తరలివెళ్లి మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర సమీపిస్తున్న వేళ ఇప్పటికే చాలా మంది భక్తులు మేడారం బాట పడుతున్నారు. ఈనెల 28, 29, 30, 31 తేదీల్లో మహాజాతర జరగనుండగా భక్తులను తరలించేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తం అవుతున్నారు. జాతర జరిగే మూడు రోజుల ముందు నుంచే ప్రత్యేకంగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.


medaram1.3.jpg

ఈ నెల 25 నుంచే మొదలు..

భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుంచి వివిధ ప్రాంతాల మీదుగా మేడారానికి భక్తులతను సురక్షితంగా తరలించేందుకు భూపాలపల్లి ఆర్టీసీ డిపో అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ నెల 25 నుంచి మొదలై జాతర మొదలు ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులను నడిపించనున్నారు. 8 రోజుల పాటు భక్తులను తరలించేందుకు ప్రత్యేకంగా 340 బస్సులను సిద్ధం చేశారు. రోజుకు సుమారు 50 ట్రిప్పులను నడిపించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇందుకు నాలుగు టికెట్‌ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.


medaram1.2.jpg

గత జాతరలో 15,700 మంది తరలింపు

రెండేళ్లకోమారు మహా మేడారం జాతర ఉంటుందే విషయం అందరికీ తెలిసిన విషయమే. 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు మహా మేడారం జాతర జరిగింది. ఈ జాతరకు భూపాలపల్లి డిపో నుండి ప్రయాణీకుల సౌకర్యార్థం 303 బస్సులను ఏర్పాటు చేశారు. 8 రోజులు రోజువారిగా 40 ట్రిప్పుల చొప్పున రాకపోకలు సాగించారు. ఈ క్రమంలో ఈ డిపో నుండి మొత్తంగా 15,700 మంది ఆర్టీసీని సద్వినియోగం చేసుకున్నారు. అయితే, సకాలంలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడంలో అప్పటి అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపించాయి. ఫలితంగా ప్రైవేటు వాహనాల్లోనే భక్తులు తరలివెళ్లడంతో అతి తక్కువ మంది ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఎదురైందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.


మహాలక్ష్మి పథకం వర్తింపు

ప్రభుత్వం మహిళల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ జాతరలో ఆర్టీసీలో ఉచిత ప్రయాణాలను కల్పించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న తరహాలోనే సూపర్‌ లగ్జరీ బస్సులు మినహా ఎక్స్‌ప్రెస్‌, ఆర్డీనరీల్లో మేడారానికి తరలివెళ్లే భక్తులకు ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందని అధికారులు వెల్లడించారు. అయితే, చార్జీల పెంపు ఉంటుందనే చర్చ సాగతుండగా వాటిపై ప్రభత్వం ఇప్పటికి స్పష్టతనివ్వలేదు. గత జాతర మాదిరిగానే చార్జీలను అమలు చేస్తారా.. లేదా పెంచుతారా? అనే విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు 340 బస్సులను ఏర్పాటు చేస్తున్న అధికారులు వీటిని సమయానుకూలంతో పాటు ప్రయాణికలకు సరిపడా బస్సులను సకాలంలో అందుబాటులో ఉంచేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలనే డిమాండ్‌ భక్తుల నుంచి వ్యక్తమవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి.

అవును.. శ్రీరాముడికి బీజేపీ సభ్యత్వం ఉంది

వేడి వేడిగా వెరైటీ సూప్‌లు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 17 , 2026 | 12:35 PM