Home » Mallikarjun Kharge
కాంగ్రెస్‌తో 2019లో జరిగిన వివాహం వేధింపుల కారణంగానే విడాకులతో ముగిసిందని మాజీ ప్రధానమంత్రి, జనతా దళ్ సెక్యులర్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ చెప్పారు.
రాజ్యసభలో పదవీకాలం ముగిసిన సభ్యుల వీడ్కోలు సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారంనాడు కాసేపు నవ్వులు పూయించారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడను ఉద్దేశించి మాట్లాడుతూ, గత 54 ఏళ్లుగా ఆయన తనకు తెలుసునని, ఆయనతో కలిసి పనిచేశానని చెప్పారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇవాళ(గురువారం) ఢిల్లీలో కలిశారు. ఖర్గేతో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలపై సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కూడా ఈ విషయంపై మాట్లాడానని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పనితీరుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐసీసీ నేతలు ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని రాహుల్‌గాంధీ సూచించారు..
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ సీఎం, మంత్రులు ఇవాళ (గురువారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఖర్గే చర్చించారు. రెండేళ్ల ప్రభుత్వ పనితీరుపై రెండు గంటల పాటు ఖర్గే సమీక్ష జరిపారు..
మేడారం జాతరను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అభినందించారు. మేడారం జాతర చరిత్ర, ప్రాశస్త్యం గురించి మంత్రిని అడిగి తెలుసుకున్నారు..
140వ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవాళ జరుపుకుంటోంది. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ జెండాను ఆవిష్కరించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితర సీనియర్ నాయకులు..
అంతర్గత సమస్యలకు అధిష్టానంపై నిందలు వేయకుండా స్థానిక నాయకులే బాధ్యత వహించాలని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
దేశాన్ని తుదముట్టించడమే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అని ఖర్గే విమర్శించారు. బెంగళూరులో తన కుమారునికి ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ తాను వెళ్లలేదని, ర్యాలీకి హాజరయ్యేందుకు ఇక్కడే ఉండిపోయానని చెప్పారు.
శీతాకాల సమావేశాల తొలి రోజే పార్లమెంటు ముందున్న కీలక ఆంశాల గురించి మోదీ ప్రస్తావించే బదులు నాటకీయ ప్రసంగం సాగించారని ఖర్గే తప్పుపట్టారు. 11 ఏళ్లుగా పార్లమెంటరీ మర్యాదలు, వ్యవస్థను ప్రభుత్వం అణిచివేస్తోందన్నదే అసలు నిజమని అన్నారు.