Home » Mahabubabad
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్టేజీ తండా సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటలకు 563 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్ సమీపంలో జాతీయ రహదారి 563పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న గ్రానైట్ లారీ, కోళ్ల దాన బస్తాల లారీ ఢీ కొన్నాయి. ఈ రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో రెండు లారీల్లోని ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ సజీవ దహనమయ్యారు.
Kuberaa Movie: కుబేర సినిమాలో బిచ్చగాడిగా ధనుష్, మాజీ సీబీఐ అధికారిగా నాగార్జున, ప్రేమలో విఫలమైన యువతిగా రష్మిక అద్భుతంగా నటించారు. నాగార్జున నటన కొత్తగా అనిపిస్తుంది.
Minister Seethakka: దుబ్బగూడం, కొండపర్తి వంటి గ్రామాలకు రహదారులు లేకపోవడం వల్ల కనీసం అంబులెన్స్ వెళ్లే పరిస్థితి లేదని మంత్రి సీతక్క చెప్పారు. అందుకే నిబంధనల పేర ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని మంత్రి సీతక్క సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రజా ప్రభుత్వ నిధులు మంజూరు చేసినా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని మంత్రి సీతక్క గుర్తు చేశారు.
పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రానికి వెళ్లిన రైతు వడదెబ్బతో కుప్పకూలాడు. ఐదు రోజులైనా పంటను కొనుగోలు చేయకపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తూ ఎండదెబ్బతో ధాన్యం రాశిపైనే మృతిచెందాడు.
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా, కంబాలపల్లి గ్రామంలో ఆయన మోటార్ మెకానిక్. కేవలం పదో తరగతి వరకే చదివారు. చదువు కొనసాగించడంలో ఎదురైన అనేక అడ్డంకులు ఆయన ఆవిష్కరణ పటిమకు అడ్డంకి కాలేదు.
ఇంటర్మీడియట్ మాదిరిగానే పదో తరగతి ఫలితాల్లోనూ విద్యార్థులు అదరగొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షలపైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవ్వగా.. రికార్డు స్థాయిలో 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
మహబూబాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ రవాణాశాఖ అధికారి(డీటీవో)గా పని చేస్తూ.. గతంలో సస్పెండైన మహ్మద్ గౌస్‌పాషా నివాసంతో పాటు ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
BRS Leaders FIGHT: మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. రజతోత్సవ సభ నేపథ్యంలో బీఆర్ఎస్‌లోని ఇద్దరి నేతల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.
తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యే ప్రియుడితో కలిసి ఓ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి చంపించింది. ఈ నెల 1న అర్ధరాత్రి మహబూబాబాద్ జిల్లా అయోధ్య గ్రామపరిధిలోని భజనతండా సమీపంలో జరిగిన హెల్త్‌సూపర్ వైజర్ తాటి పార్థసారథి హత్య మిస్టరీ వీడింది.