Woman: రైస్ మిల్లులో దారుణం.. లోపలికి చొరబడిన బీహార్ యువకులు.. పని చేస్తున్న మహిళపై..
ABN , Publish Date - Dec 22 , 2025 | 06:58 PM
ఓ మహిళ రైస్ మిల్లులో పని చేస్తుంటుంది. అయితే ఇటీవల సదరు మహిళ మిల్లులో పని చేస్తుండగా.. బీహార్‌కు చెందిన ఇద్దరు యువకులు ఆమెపై కన్నేశారు. ఒంటరిగా ఉన్న సమయంలో రైస్ మిల్‌లోకి చొరబడి..
మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు... కామాంధులు రెచ్చిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా వారిపై దారుణానికి పాల్పడుతున్నారు. ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా కూడా ఇలాంటి అకృత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, మహబూబాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. రైస్ మిల్లులో పని చేస్తున్న మహిళపై బీహార్‌కు చెందిన యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. చివరకు ఏమైందంటే..
తెలంగాణ మహబూబాబాద్ (Mahbubabad) ఇనుగుర్తి మండల పరిధిలోని ఓ రైస్ మిల్లులో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ రైస్ మిల్లులో (Rice mill) పని చేస్తుంటుంది. అయితే ఇటీవల సదరు మహిళ మిల్లులో పని చేస్తుండగా.. బీహార్‌కు చెందిన ఇద్దరు యువకులు ఆమెపై కన్నేశారు. ఒంటరిగా ఉన్న సమయంలో రైస్ మిల్‌లోకి చొరబడి ఆమెపై అత్యాచార యత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా షాకైన ఆ మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది.
ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని స్థానికులకు విషయం తెలియజేసింది. స్థానికులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఇస్రో నుంచి మరో రాకెట్ ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్
Read Latest Telangana News And Telugu News