Mahabubabad Collapsing school: కూలిపోతున్న స్కూల్..

ABN, Publish Date - Oct 29 , 2025 | 09:38 PM

ప్రతి పిల్లాడి భవిష్యత్ తరగతి గది నుంచే మొదలవుతుందని అంటారు. కానీ ఆ తరగతి గదే కూలిపోయే స్థితిలో ఉంటే.. మహబూబాద్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇక్కడి స్కూల్ భవనం ఆందోళన కలిగిస్తోంది..

ప్రతి పిల్లాడి భవిష్యత్ తరగతి గది నుంచే మొదలవుతుందని అంటారు. కానీ ఆ తరగతి గదే కూలిపోయే స్థితిలో ఉంటే.. మహబూబాద్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇక్కడి స్కూల్ భవనం ఆందోళన కలిగిస్తోంది. గూడూరు మండలం సీతానగరం గ్రామ శివారులోని పేటతండా స్కూల్ పరిస్థితి ఇది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాసదుపాయాల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ. ఇక్కడ పాఠశాల భవనం కూలిపోయే స్థితికి చేరుకుంది. దీనికి కారణం ఏళ్లుగా అధికారుల ఘోర నిర్లక్ష్యమే. మరమ్మతులు లేక పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గోడలు పగిలిపోయి.. పైకప్పు ఏక్షణమైనా కూలిపోయే పరిస్థితిలో ఉంది. దీంతో విద్యార్థులు రోజూ భయం భయంగా చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. తమ పిల్లల భద్రత గురించి భయపడుతున్న తండావాసులు, గ్రామస్తులు కలిసి ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Oct 29 , 2025 | 09:38 PM