గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి
ABN, Publish Date - Dec 09 , 2025 | 05:08 PM
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాయపాటి బుచ్చిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి సమయంలో ప్రచారం చేసి ఇంటికి తిరిగిన వెళ్లిన బుచ్చిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు.
మహబూబాబాద్, డిసెంబర్ 9: జిల్లాలోని నడివాడలో విషాదం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాయపాటి బుచ్చిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి సమయంలో ప్రచారం చేసి ఇంటికి తిరిగిన వెళ్లిన బుచ్చిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బుచ్చిరెడ్డి తుదిశ్వాస విడిచారు. కాగా.. గ్రామంలో సర్పంచ్ పదవి కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు బలపర్చిన ముగ్గురు అభ్యర్థులు మాత్రమే బరిలోకి దిగారు.
ఇవి కూడా చదవండి...
గ్లోబల్ సమ్మిట్.. పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ వరుస సమావేశాలు
భూవివాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. అధికారుల సర్వే.. హైటెన్షన్
Read Latest Telangana News And Telugu News
Updated at - Dec 09 , 2025 | 05:14 PM