Home » Lok Sabha
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టడాన్ని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. ఈ బిల్లు ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్యగా అభివర్ణించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఇటీవల మృతిచెందిన పలువురు ప్రముఖులకు లోక్‌సభలో నివాళులర్పించారు. అనంతరం ప్రధాన బిల్లుపై చర్చ మొదలైంది.
లోక్‌సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి 850కి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది.
దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న వీటిని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
అమరావతి చట్టబద్ధత బిల్లుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా చట్టబద్ధత కల్పించిన బిల్లుకు లోక్‌సభలో ఆమోదం పొంది.. రాజ్యసభకు చేరుకుంది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ బుధవారం న్యూఢిల్లీలో వెల్లడించారు.
అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అమరావతి బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు.
రాజధానిపై గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడిందని ఎంపీ పురందేశ్వరి విమర్శించారు. అమరావతి తొలి ప్రజా రాజధానిగా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు.
రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాలు అమరావతి కోసం సమీకరించిన వ్యక్తి చంద్రబాబు అని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కొనియాడారు. లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చలో కేంద్రమంత్రి మాట్లాడారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను టీడీపీ ఎంపీలు కలిశారు. అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లును మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టి చర్చకు అనుమతించాలని ఎంపీలు కోరారు.