Share News

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ABN , Publish Date - Apr 01 , 2026 | 02:09 PM

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అమరావతి బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు.

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Amaravati Capital Bill

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్‌సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. వైసీపీ మినహా మిగిలిన పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. అమరావతి బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు. అమరావతి బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. ఈరోజు(బుధవారం) ఉదయం అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చలో ఎంపీలు పాల్గొన్నారు. చర్చ తర్వాత అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రకటించారు.


రైతుల త్యాగం చరిత్రలో నిలుస్తుంది: ఎంపీ అప్పలనాయుడు

అమరావతి రైతుల త్యాగం అపారమైందని ఎంపీ అప్పలనాయుడు అన్నారు. లోక్‌సభలో ఎంపీ మాట్లాడుతూ.. రైతుల త్యాగం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. రైతు భూమి కేవలం ఆస్తి కాదని, అది వారి జీవితంతో సమానమన్నారు. తండ్రికి బిడ్డతో ఉండే అనుబంధం ఎలా ఉంటుందో రైతుకు భూమితో బంధం ఉంటుందని వివరించారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం రైతులు తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి సుమారు 33 వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. ఈ త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది తెలిపారు. వైసీపీ నేతలు అమరావతిని తక్కువ చేసి మాట్లాడారని మండిపడ్డారు. అమరావతి అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ సభ్యులు వాక్‌అవుట్ చేయడం దురదృష్టకరమన్నారు. ఇది రాష్ట్ర ప్రజల భావోద్వేగాలను అవమానించినట్లే అని ఎంపీ అప్పలనాయుడు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు: సీఎం చంద్రబాబు

ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి: ఎంపీ పురందేశ్వరి

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 01 , 2026 | 03:08 PM