ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి: ఎంపీ పురందేశ్వరి
ABN , Publish Date - Apr 01 , 2026 | 02:02 PM
రాజధానిపై గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడిందని ఎంపీ పురందేశ్వరి విమర్శించారు. అమరావతి తొలి ప్రజా రాజధానిగా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని ఎంపీ పురందేశ్వరి(MP Purandeshwari) తెలిపారు. లోక్సభలో అమరావతి బిల్లుపై చర్చలో ఎంపీ మాట్లాడుతూ.. ఆనాడు చర్చ లేకుండా ఏపీ విభజన జరిగిందని అన్నారు. వైసీపీ హయాంలో రాజధానిపై తీవ్ర అస్థిరత నెలకొందని.. రాజధానిపై గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడిందని విమర్శించారు. అమరావతి తొలి ప్రజా రాజధానిగా గుర్తింపు తెచ్చుకుందని ఎంపీ తెలిపారు. విభజన ఆగ్రహం నుంచి రాజధాని అమరావతి పుట్టిందని వెల్లడించారు.
29 వేలమంది రైతులు అమరావతి కోసం భూములు ఇచ్చారని.. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారన్నారు ఎంపీ. వైసీపీ వచ్చాక అమరావతి భవితవ్యం అంధకారంలో పడిందని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో ఏపీలో అరాచక పాలన సాగిందని విమర్శలు గుప్పించారు. వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేసిందన్నారు. అమరావతి కోసం రాజధాని రైతులు 1600 రోజులకు పైగా ఉద్యమించారని తెలిపారు. రాజధాని రైతులను అప్పటి ప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టిందని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరించలేదన్న కాంగ్రెస్ విమర్శలు సరికాదన్నారు. రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం హడ్కో నిధులు విడుదల చేసిందని ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
బిల్లుపై మాట్లాడటం అమరావతి బిడ్డగా గర్విస్తున్నా: కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News