Share News

అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ లోక్‌సభ నుంచి వైసీపీ వాకౌట్‌

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:42 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించటం కోసం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. వైసీపీ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ సభనుంచి వాకౌట్‌ చేశారు.

అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ లోక్‌సభ నుంచి వైసీపీ వాకౌట్‌
Mithun Reddy Amaravati comments

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించటం కోసం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. వైసీపీ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ సభనుంచి వాకౌట్‌ చేశారు. లోక్‌సభలో చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత స్థితిలో ఉన్న బిల్లుకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని నిర్ణయమన్నది రాష్ట్ర ఇష్టమని.. గతంలో హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్‌ ఇచ్చిందని తెలిపారు. ఏపీ సభ్యులు ప్రత్యేక హోదా, పోలవరం నిధులపై మాట్లాడితే బాగుండేదని పేర్కొన్నారు. ఇప్పటివరకు అమరావతి రైతులకు ప్లాట్లు ఇవ్వలేదని అన్నారు.


ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘అమరావతిపై కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.5 వేల కోట్లే ఖర్చు చేసింది. రాజధాని రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో బిల్లులో పెట్టాలి. రాజధాని కోసం వేల ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది?. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు?. 50 వేల ఎకరాలు ఉండగా.. మరో 50 వేల ఎకరాలు కావాలంటున్నారు. అదనపు భూసేకరణ ఎందుకు?. రాజధాని విషయంలో చంద్రబాబుకు స్పష్టత లేదు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

ఏప్రిల్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ బెస్ట్ ప్రదేశాలు మిస్ అవ్వకండి..!

అమ్మాయి కోసం రైలు పట్టాలపై కలబడి కొట్టుకున్న అబ్బాయిలు

Updated Date - Apr 01 , 2026 | 02:14 PM