ఏప్రిల్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ బెస్ట్ ప్రదేశాలు మిస్ అవ్వకండి..!
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:26 PM
ఏప్రిల్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ ప్రదేశాలను అస్సలు మిస్ అవ్వకండి. ఈ సమయంలో ప్రకృతి అందాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఏప్రిల్ నెల ప్రయాణాలకు చాలా అనుకూలమైన సమయం. ఈ సమయంలో వాతావరణం హాయిగా ఉండి, ప్రకృతి అందాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పర్వతాలు, సముద్ర తీరాలు, చారిత్రక ప్రదేశాలు ఆల్ ఇన్ వన్‌గా చూడాలనుకుంటే, కొన్ని అద్భుతమైన గమ్యస్థానాలను సందర్శించడం మంచిది. ఇప్పుడు ఏప్రిల్‌లో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశాలు ఏవో చూద్దాం..
ఉదయ్‌పూర్, రాజస్థాన్:
ఉదయ్‌పూర్‌ను సరస్సుల నగరంగా పిలుస్తారు. పిచోలా, ఫతే సాగర్ సరస్సులు, రాజభవనాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఏప్రిల్‌లో ఇక్కడ వాతావరణం చల్లగా ఉండి, బోటింగ్‌కు అనువుగా ఉంటుంది.

కౌసాని, ఉత్తరాఖండ్:
హిమాలయ పర్వతాల అద్భుత దృశ్యాలు చూడాలంటే కౌసాని మంచి ప్రదేశం. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఎంతో అందంగా ఉంటాయి. పచ్చని తేయాకు తోటలు కూడా ఆకట్టుకుంటాయి.

గోవా:
సముద్ర తీరాలు, బీచ్ పార్టీలు, జలక్రీడలు ఆస్వాదించాలంటే గోవా బెస్ట్ ప్లేస్. పోర్చుగీస్ సంస్కృతి, అందమైన బీచ్‌లు, చారిత్రక కట్టడాలు, నైట్ లైఫ్‌కు ఇది ప్రసిద్ధి.

కాశ్మీర్:
భూలోక స్వర్గంగా పేరుగాంచిన కాశ్మీర్ ఏప్రిల్‌లో మరింత అందంగా ఉంటుంది. తులిప్ పూల తోటలు, దాల్ సరస్సులో బోటింగ్, పర్వత దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

డార్జిలింగ్:
తేయాకు తోటలు, పచ్చని కొండలు, టాయ్ ట్రైన్ ప్రయాణం డార్జిలింగ్ ప్రత్యేకత. ఏప్రిల్‌లో ఇక్కడి వాతావరణం చాలా హాయిగా ఉంటుంది.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు
For More Lifestyle