Share News

నేచురల్‌గా గ్లో కావాలా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:36 AM

ఈ వేసవిలో జిడ్డు చర్మం సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నారా? అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో మచ్చలేని, తాజాగా కనిపించే చర్మాన్ని పొందవచ్చు.

నేచురల్‌గా గ్లో కావాలా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి
Oily Skin Home Remedies

ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో ఎండ, చెమట కారణంగా చర్మం జిడ్డుగా మారుతుంది. దీంతో మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే చర్మాన్ని శుభ్రంగా, తాజాగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఖరీదైన ఉత్పత్తులకంటే ఇంట్లోనే లభించే సహజ పదార్థాలు ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.


దోసకాయ రసం:

దోసకాయ ముఖ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో 95% పైగా నీరు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C, ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల చర్మాన్ని హైడ్రేట్ చేసి, కాంతివంతంగా మారుస్తుంది. నల్లటి మచ్చలు, మొటిమలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. దోసకాయ రసం ముఖానికి రాసి మర్దన చేయడం వల్ల చర్మం తాజాగా మారుతుంది.


కలబంద:

కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది మొటిమలు తగ్గించి చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. అలాగే చర్మానికి తేమను అందిస్తుంది.

ముఖం కడుక్కోవడం:

రోజుకు కనీసం రెండు సార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవడం వల్ల మలినాలు తొలగిపోతాయి. దీంతో చర్మం తాజాగా ఉండి, జిడ్డుదనం తగ్గుతుంది.


మాయిశ్చరైజర్ వాడటం:

వేసవిలో మాయిశ్చరైజర్ అవసరం లేదనుకోవడం తప్పు. ఆయిల్-ఫ్రీ మాయిశ్చరైజర్ వాడటం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది, ముఖ్యంగా ఆయిల్ స్కిన్ వారికి ఇది బాగా పనిచేస్తుంది.

సన్‌స్క్రీన్ వాడటం:

ఎండలో బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ రాయాలి. ఇది చర్మాన్ని హానికరమైన సూర్యకిరణాల నుంచి రక్షిస్తుంది. ఈ చిన్నచిన్న అలవాట్లు పాటిస్తే వేసవిలో కూడా మీ చర్మం శుభ్రంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Lifestyle

Updated Date - Apr 01 , 2026 | 11:59 AM