Share News

అమ్మాయి కోసం రైలు పట్టాలపై కొట్టుకున్న అబ్బాయిలు

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:20 PM

ముంబైలోని ములంద్ ఏరియాలో ఓ ఇద్దరు అబ్బాయిలు.. ఓ అమ్మాయి కోసం రైలు పట్టాలపై పడి కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు విచక్షణా రహితంగా దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అమ్మాయి కోసం రైలు పట్టాలపై కొట్టుకున్న అబ్బాయిలు
Mulund viral video

ఇంటర్‌నెట్ డెస్క్: స్కూలుకు వెళ్లి బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో ఓ ఇద్దరు అబ్బాయిలు తప్పుదోవపట్టారు. అమ్మాయి కోసం రైలు పట్టాలపై పడి కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు విచక్షణా రహితంగా దాడి చేసుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఇద్దరు అబ్బాయిలు ములంద్‌లోని పాఠశాలలో చదువుతున్నారు. మంగళవారం సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వెళ్లడానికి ములంద్ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అక్కడ ఓ అమ్మాయి విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.


ఆ గొడవ చిలికిచిలికి గాలి వానలా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం మొదలెట్టారు. రైల్వే ప్లాట్ ఫామ్ మీద నుంచి పట్టాలపైకి దూకారు. పట్టాలపై పడి కొట్టుకోవటం మొదలెట్టారు. ఓ వ్యక్తి వారిని విడిపించడానికి చాలా ప్రయత్నించాడు. అయినా అతడి వల్ల కాలేదు. ట్రైన్ వస్తున్నా కూడా వారు గొడవ ఆపలేదు. రైలు వస్తోందంటూ అక్కడి ప్రయాణీకులు గట్టిగా కేకలు వేయటం మొదలెట్టారు. జనం గట్టిగా కేకలు వేస్తున్నా కూడా వాళ్లు గొడవ ఆపలేదు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి రైలు పట్టాలపైకి దూకాడు. ఓ బాలుడిని బలవంతంగా పట్టి చేతుల్లోకి తీసుకున్నాడు.


పట్టాలపైనుంచి నేరుగా ప్లాట్ ఫామ్ మీదకు తీసుకొచ్చి పడేశాడు. దీంతో గొడవ ఆగిపోయింది. ప్లాట్ ఫామ్‌పై ఉన్న ఓ మహిళ ఇందుకు సంబంధించిన దృశ్యాలను తన ఫోన్‌లో వీడియో తీసింది. ఆ వీడియోను రమేశ్ తివారీ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ అబ్బాయిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘చదువుకోవాల్సిన వయసులో ఈ చెత్త పనులు ఏంటి? తల్లిదండ్రులు గట్టిగా బుద్ధి చెప్పాలి’..‘ఇప్పుడే వీళ్లు ఇలా ఉంటే.. భవిష్యత్తులో ఇంకెలా ఉంటారో’అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి చదవండి

ఖలిస్థానీ ఉగ్రవాదిపై అరోపణలు కొట్టివేత.. తీర్పు వెలువరించిన కెనడా కోర్టు..

క్రికెటర్లలో నాకు ఎవరూ ఫ్రెండ్స్ లేరు.. ఆసక్తికర విషయాలను వెల్లడించిన అర్జున్ టెండూల్కర్

Updated Date - Apr 01 , 2026 | 02:46 PM