లోక్‌సభ స్థానాలు 850కి పెరగనున్నాయా.. పునర్విభజన బిల్లుకు రంగం సిద్ధం..
ABN , Publish Date - Apr 14 , 2026 | 06:27 PM
లోక్‌సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి 850కి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది.
లోక్‌సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి 850కి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. వివిధ రాష్ట్రాల లోక్‌సభ సీట్లను 815కు, కేంద్ర పాలిత ప్రాంతాల సీట్లను 35కు పెంచబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 543 నుంచి 850కి చేరొచ్చని సమాచారం (Delimitation bill India 2026).
ఈ రెండు బిల్లుల గురించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు, ఎంపీలకు కేంద్రం సమాచారం ఇచ్చింది. ఆ ప్రతులను వారికి పంపింది. నియోజకవర్గాల పునర్విభజన గురించి గత రెండు వారాలుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఆ ముసాయిదా చట్ట ప్రతులను మంగళవారం తొలిసారిగా ఎంపీలకు కేంద్రం పంపింది. పార్లమెంటు గురువారం నుంచి మూడు రోజుల పాటు సమావేశమవుతుంది. ఆ సమావేశాల్లోనే ఈ రెండు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది (Lok Sabha seats increase 850).
లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమాన్ని పూర్తి చేయనుంది (India parliamentary seats expansion). అన్నీ అనుకున్నట్టు జరిగితే 2029 ఎన్నికల్లో 850 ఎంపీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతాయి. కాగా, అన్ని రాష్ట్రాలకు సగటున లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను 50 శాతం పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. దీని వల్ల అన్ని రాష్ట్రాలకూ ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
ఆ ఐదు దేశాలూ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఐక్యరాజ్యసమితికి ఇరాన్ లేఖ..
అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమవడానికి కారణం అదేనా.. అసలేం జరిగిందంటే..