Share News

హోర్ముజ్ సంక్షోభం.. దేశీయ చమురు సంస్థలకు రోజుకు ఎన్నివేల కోట్ల నష్టమంటే..

ABN , Publish Date - Apr 14 , 2026 | 06:06 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. హోర్ముజ్ ద్వారా జరగాల్సిన చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో దేశీయ ప్రభుత్వరంగ చమురు సంస్థలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.

హోర్ముజ్ సంక్షోభం.. దేశీయ చమురు సంస్థలకు రోజుకు ఎన్నివేల కోట్ల నష్టమంటే..
crude oil surge impact

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. హోర్ముజ్ ద్వారా జరగాల్సిన చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో దేశీయ ప్రభుత్వరంగ చమురు సంస్థలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, అందుకు తగినట్టు దేశీయంగా పెరగకపోవడంతో నష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వ చమురు రంగ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలు రోజుకు వేల కోట్ల రూపాయల నష్టాలు ఎదుర్కొంటున్నాయి (Petrol diesel losses India).


దేశీయంగా ధరలు పెరగకపోవడంతో చమురు సంస్థలు లీటర్ పెట్రోల్‌పై రూ.18, లీటర్ డీజిల్‌పై రూ.35 చొప్పున నష్టాలు చవిచూస్తున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితమే చమురు ధరలను డీరెగ్యులేట్ చేసింది. అంటే డిమాండ్, సరఫరాను బట్టి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలే నిర్ణయిస్తాయి. అయితే 2022 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగానే కొనసాగిస్తున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి (Indian oil companies losses).


అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి (Fuel pricing crisis India). దీంతో మూడు ప్రభుత్వ రంగ సంస్థలు రోజుకు రూ.2400 కోట్ల మేర నష్టాలు భరించేవి. అయితే ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించడం కాస్త ఊరట కలిగించింది. దీంతో నష్టం రూ.1600 కోట్లకు తగ్గింది. కాగా, ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముంది.


ఇవి కూడా చదవండి..

ఆ ఐదు దేశాలూ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఐక్యరాజ్యసమితికి ఇరాన్ లేఖ..


అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమవడానికి కారణం అదేనా.. అసలేం జరిగిందంటే..

Updated Date - Apr 14 , 2026 | 06:06 PM