Share News

బిహార్ నూతన సీఎంగా సమ్రాట్ చౌధరీ..

ABN , Publish Date - Apr 14 , 2026 | 04:38 PM

బిహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ ఎంపికయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలు పాటు బిహార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న నితీష్ కుమార్ రాజీనామా చేశారు. బిహార్‌లో అత్యున్నత్తు పదవిని అధిరోహించిన తొలి బీజేపీ నేతగా సమ్రాట్ చౌధరీ నిలిచారు.

బిహార్ నూతన సీఎంగా సమ్రాట్ చౌధరీ..
Samrat Choudhary Bihar CM

బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరీ ఎంపికయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలు పాటు బిహార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న నితీష్ కుమార్ కాసేపటి క్రితమే రాజీనామా చేశారు. దీంతో బిహార్‌లో అత్యున్నత పదవిని అధిరోహించనున్న తొలి బీజేపీ నేతగా సమ్రాట్ చౌధరీ నిలిచారు. ఇప్పటివరకు బిహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న 57 ఏళ్ల సమ్రాట్ ఓబీసీ వర్గమైన కుష్వాహా కులానికి చెందినవారు. బిహార్‌లోని ఓబీసీ కులాలలో యాదవుల తర్వాత కుష్వాహా వర్గమే అతి పెద్దది (Samrat Choudhary Bihar CM).


ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన నితీష్.. కుష్వాహా కులానికి చెందిన వ్యక్తినే తదుపరి సీఎంగా ప్రకటించాలని షరతు విధించినట్టు సమాచారం. నితీష్ సలహా మేరకే బీజేపీ.. సమ్రాట్‌కు సీఎం పీఠం అప్పగించినట్టు తెలుస్తోంది. మధ్యలో కొన్ని సంవత్సరాలు మినహా 2005 నుంచి బీజేపీ, బిహార్ ప్రభుత్వంలో మైనర్ భాగస్వామిగా ఉంటూ వచ్చింది. 20 సంవత్సరాల తర్వాత బీజేపీకి చెందిన నేత బిహార్ సీఎం అయ్యారు. 243 మంది సభ్యులున్న బిహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ పార్టీకి 85 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 89 మంది ఉన్నారు (Bihar new chief minister 2026).


కాగా, బిహార్ కొత్త సీఎం అయిన సమ్రాట్ చౌధరీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి (BJP first CM Bihar). ఆయన మొదట ఆర్జేడీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత జేడీ (యు)లో చేరారు. ఆ తర్వాత బీజేపీలో చేరి కీలక నాయకుడిగా ఎదిగారు. ఈ రకంగా ఆయనకు బిహార్‌లోని మూడు ప్రధాన పార్టీల్లో పని చేసిన అనుభవం ఉంది. కాగా, ఏప్రిల్ 15వ తేదీన బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


ఇవి కూడా చదవండి..

ఆ ఐదు దేశాలూ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఐక్యరాజ్యసమితికి ఇరాన్ లేఖ..


అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమవడానికి కారణం అదేనా.. అసలేం జరిగిందంటే..

Updated Date - Apr 14 , 2026 | 05:27 PM