Share News

మరికొద్ది సేపట్లో బిహార్ కొత్త సీఎం ప్రకటన.. 15న ప్రమాణ స్వీకారం?

ABN , Publish Date - Apr 14 , 2026 | 03:58 PM

దాదాపు రెండు దశాబ్దాల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీష్ కుమార్ రాజీనామా చేయబోతున్నారు. పట్నాలో తన చివరి కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం తన ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయనున్నారు.

మరికొద్ది సేపట్లో బిహార్ కొత్త సీఎం ప్రకటన.. 15న ప్రమాణ స్వీకారం?
Nitish Kumar resignation 2026

దాదాపు రెండు దశాబ్దాల పాటు బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీష్ కుమార్ రాజీనామా చేశారు. పట్నాలో తన చివరి కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి పదవి నుంచి నితీష్ వైదొలిగారు. దీంతో తమ నాయకుడిని ఎన్నుకోవడానికి ఎన్డీయే శాసనసభ పక్షం కాసేపట్లో సమావేశం కానుంది. కేంద్ర పరిశీలకుడిగా నియమితుడైన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు (Bihar new CM announcement).


బిహార్ తదుపరి ముఖ్యమంత్రి రేసులో బీజేపీకి చెందిన సమ్రాట్ చౌధరి, జేడీయూకు చెందిన నిశాంత్ కుమార్‌ ఉన్నారు. బిహార్ శాసనసభ సెంట్రల్ హాల్‌లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఎన్డీయే సమావేశంలో సీఎం ఎవరనే నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే బుధవారం సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం కూడా జరగనుంది (NDA meeting Bihar).


243 సీట్లున్న బిహార్ శాసనసభలో ఎన్డీయేకు 202 మంది సభ్యుల బలం ఉంది (Samrat Choudhary CM). ప్రస్తుత ఉపముఖ్యమ్రంతి అయిన సమ్రాట్ చౌధరి బిహార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద రాయ్, నితీష్ కుమారుడు నిశాంత్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. నిశాంత్‌కు సీఎం అయ్యే అవకాశం ఇప్పట్లో లేదని, అయితే క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఆ ఐదు దేశాలూ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఐక్యరాజ్యసమితికి ఇరాన్ లేఖ..


అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమవడానికి కారణం అదేనా.. అసలేం జరిగిందంటే..

Updated Date - Apr 14 , 2026 | 04:51 PM